కియారా, బాలీవుడ్ నటుడు సిద్దార్థ మల్హోత్రా ఇంటికి వెళ్లింది. అక్కడ ఆమె కారు డోరును ఒక వృద్ధుడు తెరిచి ఆమెకు సెల్యూట్ చేశాడు. అప్పుడు ఆమె తాపీగా కారు నుంచి దిగి భవంతి లోపలికి వడివడిగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. దీనికి సంబంధించిన ఫొటో, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు కియారా మీద మండిపడుతున్నారు. కారు డోరు కూడా తీసుకోవడం చేతకాదా? అని ప్రశ్నిస్తున్నారు.
అయినా తామేదో గొప్పవాళ్లమని ఊహించునే సెలబ్రిటీలు ఇలా వయసు మీద పడ్డ ముసలి వాళ్లతో ఇలాంటి పనులు చేయించుకోవడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. చూస్తుంటే అతడు తండ్రి కన్నా పెద్ద వయసులో ఉన్నట్లున్నాడని, అతడితో ఇలా చేయించడం నిజంగా బాధేస్తోంది అని కామెంట్లు చేస్తున్నారు. కాగా కియారా, సిద్దార్థ మల్హోత్రా ప్రేమించుకుంటున్నట్లు గత ఏడాది నుంచి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వీళ్లిద్దరూ పార్టీలు, ఫంక్షన్లు, విహారాలు అంటూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ పలుమార్లు మీడియా కంటపడ్డ విషయం తెలిసిందే. ఇక ఈ లవ్‌బర్డ్స్ ‘షేర్షా’ సినిమాలో కలిసి నటించారు.