తెలుగు, తమిళ, బాలీవుడ్ సినిమాల్లో నటిస్తూ డేట్స్ అడ్జస్ట్ చేయలేనంత బిజీగా ఉన్న హీరోయిన్ ఇప్పుడెవరా? అని ప్రశ్నిస్తే మనకు చటుక్కున వినిపించే సమాధానం పూజా హెగ్డే. ఈ అమ్మడు మరి అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్‌లో భాగమైంది. సినిమాలకే పరిమితమైనే ఎలా అనుకుందో లేక ఖాళీగా ఉంది కదా.. చేస్తే పోలా అని అనుకుందో ఓ కమర్షియల్ యాడ్‌లో నటించింది. ఇప్పుడు సదరు యాడ్ అమ్మడిపై నెటిజన్స్ ఫైర్ కావడానికి కారణమైంది. ఇంతకీ నెటిజన్స్‌కు కోపం తెప్పించేలా పూజా హెగ్డే నటించిన యాడ్ ఏంటో తెలుసా? ఆల్కహాల్ బ్రాండ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటన. చేస్తే చేసింది.. కానీ దాన్ని తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయడం నెటిజన్స్ కోపానికి కారణమైంది.
అసలు ఇంతకీ ఆల్కహాల్ బ్రాండ్ యాడ్‌లో పూజా హెగ్డే ఏం చేసిందనే వివరాల్లోకి వెళితే, సదరు మద్యం కంపెనీ తమ కంపెనీ పాతిక సంవత్సరాలను పూర్తి చేసుకున్న కారణంగా ఓ ఛాలెంజ్‌లో పాల్గొని విదేశీ ప్రయాణానికి టికెట్స్ గెలుచుకోవాలనే సూచిస్తూ యాడ్ చేసింది. అందులో ఓ పొట్టి గౌనుని ధరించి, ఓ విస్కీని గ్లాసులో పోసి అందులో ఐసు ముక్కలు వేసుకుని కలిపింది. వెంటనే ఏదో తెలియని ఆనందంతో చిందేసింది. ఇదే సదరు యాడ్‌లో ఉన్న అంశాలు.
ఈ యాడ్‌ను ఇన్‌స్టాలో పోస్ట్ చేసిన తర్వాత డబ్బు కోసం పూజా హెగ్డే లాంటి హీరోయిన్ అలా చేయడం చాలా తప్పని కొందరు నెటిజన్స్ అంటుంటే, మరికొందరేమో, డబ్బు కోసం మద్యం సేవించాలని ఎంకరేజ్ చేసేలా ఉందని అంటున్నారు. మద్యం బ్రాండ్స్‌కు సంబంధించిన యాడ్స్‌లో నటించడం ద్వారా హీరోయిన్స్ విమర్శలను ఎదుర్కొంటున్నారు. గతంలో కాజల్ అగర్వాల్ కూడా ఇలాంటి యాడ్‌లో నటించడం వల్ల విమర్శలను ఎదుర్కోవాల్సి వచ్చింది. ఇప్పుడు పూజా హెగ్డేది కూడా సేమ్ సిట్యువేషన్. మరి దీనిపై బుట్టబొమ్మ ఏమైనా రియాక్ట్ అవుతుందో లేక సైలెంట్‌గా ఉంండిపోతుందో తెలియడం లేదు.