సౌత్ ఇండియాలో అన్ని చిత్ర ప్రరిశ్రమల్లో క్రేజ్ ఉన్న హీరోయిన్స్‌లో రష్మిక మందన్నా ఒకరు. త్వరలో సిద్ధార్థ్ మల్హోత్రా హీరోగా చేస్తున్న ‘మిషన్ మజ్ను’తో బాలీవుడ్‌కి సైతం పరిచయం కానుంది. అంతా పాపులారిటీ ఉన్న ఆమె ఎన్నో రకాల బ్రాండ్‌ల యాడ్స్‌లోనూ నటిస్తూ మంచి ఆదాయాన్ని అర్జిస్తోంది. అయితే తాజాగా బాలీవుడ్ నటుడు విక్కీ కౌశల్‌తో కలిసి ఆమె చేసిన అండర్‌వేర్ యాడ్ విమర్శల పాలైంది.
అందులో రష్మిక యోగా ఇన్‌స్ట్రక్టర్‌గా ఉండగా, విక్కీ యోగా చేస్తుంటాడు. ఆ సమయంలో షర్ట్ పైకి లేవడంతో అతని అండర్‌వేర్ పట్టీ బయటికి కనిపిస్తుంది. అది గమనించిన నటి ఇంప్రెస్ అయ్యి అలాగే చూస్తూ ఉంటుంది. అది అండర్‌గార్నమెంట్ బ్రాండ్ మాకోకి సంబంధించిన ప్రకటన. ఇలాంటి చీప్ యాడ్ ఎప్పుడూ చూడలేదంటూ నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు.
రష్మిక నుంచి ఇలాంటి చౌకబారు ప్రకటన ఊహించలేదని ఓ నెటిజన్ కామెంట్ పెట్టగా, అండర్ వేర్ దుస్తుల కంపెనీలు ఎందుకు ఇలాంటి అర్థం పర్ధం లేని యాడ్స్ తీస్తున్నారు అని మరొకరు కామెంట్ పెట్టాడు. అసలు ఈ అండర్ వేర్, డియోడరెంట్ కంపెనీలు ఇలాంటి ప్రకటనలతో ఏం చెప్పాలనుకుంటున్నారు అని తిట్టిపోశారు. అమ్మాయిలను తక్కువగా చూపించే ఇలాంటి యాడ్స్‌ని రష్మిక నటి చేయడం కరెక్ట్ కాదని విమర్శిస్తున్నారు.