ప్రేమ పెళ్లి చేసుకున్న 13 రోజులకే నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. చెన్నై అమింజికరైకు చెందిన భవానీశ్వరి కార్తీక్ అనే యువకుడిని ఈ నెల మొదటి వారంలో ప్రేమ వివాహం చేసుకుంది. ఈ నేపథ్యంలో బుధవారం ఇంట్లో ఉరేసుకున్న స్థితిలో ఆమె మృతదేహం బయట పడింది.
పెళ్లి చేసుకున్న వారం రోజులకే కార్తీక్, అతడి కుటుంబం కట్నం కోసం వేధించడం, ప్రియుడిని నమ్మి పారిపోయి వచ్చిన తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లలేని పరిస్థితిలో ఆత్మహత్య చేసుకున్నట్లు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించిన పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు.