హైదరాబాద్‌లో ఓ నవవధువు కనిపించకుండా పోయింది. ఈ ఘటన కాచిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. కామ్‌గార్ నగర్‌లో నివాసం ఉంటున్న సత్యనారాయణ అనే యువకుడికి… ఐశ్వర్య అనే అమ్మాయికి వివాహం చేశారు. ఈనెల 20న బంధుమిత్రులు, కుటుంబసభ్యుల మధ్య వీరి పెళ్లి ఘనంగా జరిగింది.
అంతా బాగానే జరిగింది. ఇద్దరూ భార్యభర్తలు తమ కొత్త జీవితం ప్రారంభించారు. ఇంతలోనే ఉగాది పండగ వచ్చింది. దీంతో సరుకులు కొనేందుకు ఐశ్వర్య బయటకు వెళ్తాను అని చెప్పింది. దీంతో కుటుంబసభ్యులు సరే అన్నారు. ఉగాది పండగ కోసం నిత్యావసర వస్తువులు తీసుకురావడానికి ఐశ్వర్య కిరాణాషాపునకు వెళ్లింది. అయితే ఎంతసేపైనా తిరిగి ఇంటికి రాలేదు. దీంతో భర్త కిరాణా షాపు వద్దకు వెళ్లాడు. అక్కడ ఐశ్వర్య కనిపించలేదు. అక్కడ పరిసరాల్లో అన్నిచోట్లా వెతికాడు. తెలిసిన వారిని, తెలియని వారిని అందర్నీ ఆరా తీశాడు. ఎక్కడ వెతికినా ఫలితం కనిపించలేదు.
ఇంతవరకు ఐశ్వర్య జాడ దొరకలేదు. దీంతో తాజాగా భర్త సత్యనారాయణ కాచిగూడ పీఎస్ లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఐశ్వర్యపై మిస్సింగ్ కేసు నమోదు చేసి వెతుకుతున్నారు. కాగా ఐశ్వర్యను ఎవరైనా కిడ్నాప్ చేశారా? లేక ఆమే ఎక్కడికైనా వెళ్లిపోయిందా? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఐశ్వర్య స్నేహితుల్ని కూడా విచారిస్తున్నారు.