త్వరలో మార్కెట్‌లోకి నూతన కాయిన్స్

new coins into the market

త్వరలోనే నూతన కాయిన్స్‌ను మార్కెట్‌లో ప్రవేశపెట్టనున్నట్లు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ నేడు పార్లమెంట్‌లో తెలిపారు. కేంద్ర వార్షిక బడ్జెట్ ప్రవేశం సందర్భంగా ఆమె ఈ విషయాన్ని వెల్లడించారు. నూతన ఒకర రూపాయి, రెండు రూపాయలు, ఐదు రూపాయలు, పది రూపాయలు, ఇరవై రూపాయల కాయిన్స్‌ను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపారు. అతి త్వరలోనే ఇవి ప్రజలకు అందుబాటులోకి వస్తాయన్నారు.