‘వార్ 2’ సినిమా పై ఫ్యాన్స్ లో కొత్త చర్చ..!

New discussion among fans about the movie 'War 2'..!
New discussion among fans about the movie 'War 2'..!

తెలుగు మూవీ కి రూ.1000 కోట్లు కలెక్షన్స్ రావడం అంటే ఒకప్పుడు సాధ్యమా అనిపించేది. కానీ ప్రస్తుతం ఈ మార్క్ దాటడం కష్టమేమీ కాదు అని తేలిపోయింది. ఇప్పటికే ‘పుష్ప 2’ మూవీ రూ.1510 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టిన సంగతి అందరికి తెలిసిందే. ఇంకా ఈ సినిమాకి నార్త్ లో కలెక్షన్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏ మూవీ చాలా త్వరగా రూ.1000 కోట్ల మార్క్ ను అందుకుంటుందో అని నెటిజన్స్ లో చర్చ మొదలయ్యింది. ఈ క్రమంలో ప్రముఖంగా వినిపిస్తున్న సినిమా పేరు ‘వార్ 2’.

New discussion among fans about the movie 'War 2'..!
New discussion among fans about the movie ‘War 2’..!

మోస్ట్ వాంటెడ్ పాన్ ఇండియా మల్టీస్టారర్స్ లో ‘ఎన్టీఆర్ – హృతిక్ రోష‌న్‌’ కలయికలో రాబోతున్న ఈ ‘వార్ 2’ మూవీ పై నిజంగానే పాన్ ఇండియా వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. సౌత్ లో ఎన్టీఆర్, నార్త్ లో హృతిక్ రోష‌న్‌ కారణంగా ఈ మూవీ కి ఎక్కడా లేని బజ్ ఉంది. కాబట్టి, హిందీలో ఆల్‌టైమ్ రికార్డ్స్ క్రియేట్ చేస్తోందని అంచనాలు ఉన్నాయి. అలాగే, సౌత్ లో కూడా ముఖ్యంగా తెలుగులో కూడా ఈ మూవీ సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే అవకాశం ఉన్నది . కాబట్టి, చాలా త్వరగా రూ.1000 కోట్ల కలెక్షన్స్ అందుకునే సినిమాగా ‘వార్ 2’ నిలిచే అవకాశం ఉంది.