చిట్టి చిట్టి మాటలు.గట్టి సందేశాలతో నెటిజన్లను ఆకట్టుకుంటున్న ట్విట్టర్ మరో సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్టాటిస్టా లెక్కల ప్రకారం.. 2021 ఏప్రిల్ నెల నాటికి ట్విట్టర్‌కి ప్రపంచ వ్యాప్తంగా 199మిలియన్ యాక్టీవ్ యూజర్లు ఉన్నారు. అయితే వారి సంఖ్యను పెంచేందుకు కొత్త ఫీచర్లను అందుబాటులో తెస్తోంది. ఇందులో భాగంగా వాయిస్ ట్వీట్ ను డెవలప్ చేస్తున్నట్లు ట్విట్టర్ ప్రతినిధులు అధికారికంగా ప్రకటించారు.
ప్రస్తుతం ఐఓఎస్ లిమిటెడ్ యూజర్లకు ఈ ఆప్షన్‌ను ఎనేబుల్ చేసింది. కానీ, ఈ ఆప్షన్ ఆండ్రాయిడ్, డెస్క్‌టాప్ వెర్షన్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో ట్విట్టర్ ప్రకటించలేదు. కాకపోతే ప్రస్తుతం ఐఓఎస్ యూజర్లకు వాయిస్ ట్వీట్ ఆప్షన్ అందుబాటులోకి తేవడంతో ఆండ్రాయిడ్, డెస్క్ టాప్ యూజర్లు వినియోగించేందుకు త్వరలోనే ఈఫీచర్ పూర్తి స్థాయిలోకి వచ్చే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఐఫోన్, ఐ పాడ్ వినియోగదారులు ఈ వాయిస్ ట్వీట్ ఆప్షన్‌ను యూజ్ చేసుకోవచ్చు.
ఆపిల్ ఐఫోన్ ,ఐప్యాడ్ యూజర్లు రెండు నిమిషాల 20 సెకన్ల వాయిస్ ట్వీట్లను మాత్రమే రికార్డ్ చేసే సదుపాయం ఉంది. వాయిస్ ట్వీట్‌ను పోస్ట్ చేయడానికి, వినియోగదారులు ఐఫోన్ లేదా ఐప్యాడ్‌లో ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేయాలి. అనంతరం కంపోజ్ ట్వీట్ ఆప్షన్ పై క్లిక్ చేస్తే వాయిస్ ట్వీట్ చేసే ఆప్షన్ మనకు కనిపిస్తుంది. అదే ఆప్షన్ లో వేవ్ లెంగ్త్ అనే ఆప్షన్ క్లిక్ చేసి వాయిస్ ట్వీట్ ను రికార్డ్ చేయాలి. పూర్తయిన తర్వాత డన్ అని క్లిక్ చేసే మీ వాయిస్ ట్వీట్ షేర్ అవుతుంది.