వాట్సాప్ తన యూజర్లకు సరికొత్త అనుభూతిని అందించడం కోసం సరికొత్త ఫీచర్ ను అందుబాటులోకి తీసుకొనివచ్చింది. ఇప్పటి వరకు మనం వాట్సాప్ వెబ్, డెస్క్ టాప్ యాప్ ద్వారా నేరుగా ఫోటోలను పంపే ఆప్షన్ మాత్రమే ఉండేది. అయితే, వాట్సాప్ కొత్తగా తీసుకొచ్చిన కొత్త ఫీచర్ వల్ల ఫోటోను ఎడిట్ చేసుకునే సదుపాయం కల్పించింది. ఈ అవకాశం ఇప్పటివరకు మొబైల్ యాప్‌లో మాత్రమే ఉంది. కొత్త ఫీచర్ ద్వారా యూజర్లు ఫోటోలను పంపడానికి ముందు స్టిక్కర్లను, ఏమోజీ, క్రాప్ చేయడానికి అదనపు ఆప్షన్ తో ఎడిట్ ఫీచర్ తీసుకొనివచ్చింది.ఈ ఫీచర్ వెంటనే యూజర్లందరికీ వెంటనే రాకపోవచ్చు.
దశల వారీగా వెబ్, డెస్క్ టాప్ యూజర్లకు తీసుకోని రానున్నట్లు తన బ్లాగ్ లో పేర్కొంది. కొద్ది రోజుల క్రితమే ‘వ్యూ వన్స్’ పేరుతో ఇంతకు ముందు ఒక ఫీచర్ తీసుకొనివచ్చింది. వ్యూ వన్స్ ఫీచర్లో భాగంగా వాట్సాప్ యాప్‌లో ఫోటో లేదా వీడియోను సెండ్ చేసేటప్పుడు యాడ్ క్యాప్షన్ బార్ పక్కన కొత్తగా ‘1’ చిహ్నాంపై ట్యాప్ చేయాలి. దీంతో రెసిపెంట్ మీరు పంపిన ఫోటోను లేదా వీడియోను ఒక్కసారి మాత్రమే చూడగలడు. రెసిపెంట్ మేసేజ్‌ను ఒపెన్ చేశాక ‘ఒపెన్డ్’ అనే సందేశం కన్పిస్తుంది. వ్యూ వన్స్ ఫీచర్‌తో మీడియా కంటెంట్‌ను రెసిపెంట్(గ్రహీత) ఫోటోలు లేదా వీడియోలు మొబైల్ గ్యాలరీలో సేవ్ కావు.