వాట్సాప్‌లో ఈ ఫీచర్‌

వాట్సాప్‌లో ఈ ఫీచర్‌

చాట్‌ కంపోజర్‌కు రూపాయి గుర్తును జోడించినట్టు వాట్సాప్‌ ప్రకటించింది. చెల్లింపులను సులభతరం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ తెలిపింది. వినియోగదార్లకు అందరికీ వాట్సాప్‌లో ఈ ఫీచర్‌ తోడవడానికి కొన్ని రోజులు పడుతుంది.

అలాగే కంపోజర్‌లో ఉన్న కెమెరాతో 2 కోట్లకుపైగా స్టోర్లలో క్యూఆర్‌ కోడ్స్‌ను స్కాన్‌ చేయవచ్చు. 1.5 కోట్ల మంది చిన్న వర్తకులు వాట్సాప్‌ బిజినెస్‌ యాప్‌ వాడుతున్నారు. వీరంతా వాట్సాప్‌ యూజర్ల నుంచి చెల్లింపులను స్వీకరించవచ్చు. పేమెంట్స్‌ సేవలను కంపెనీ భారత్‌లో గతేడాది నవంబర్‌లో ప్రారంభించింది.