ప్రముఖ వీడియో, ఫొటో షేరింగ్ ప్లాట్‌ఫామ్ ఇన్స్టాగ్రామ్ కొత్త ఫీచర్లను తీసుకురావడంలో దూకుడు ప్రదర్శిస్తోంది. వరుసగా ఫీచర్లు తీసుకొస్తూ యూజర్లకు మరిన్ని సదుపాయాలు అందిస్తోంది. ఈ క్రమంలోనే త్వరలోనే మరో ముఖ్యమైన అప్డేట్ తెచ్చేందుకు సిద్ధమైంది. ఎంతో మంది యూజర్లు ఆశిస్తున్న సదుపాయాన్ని ప్రస్తుతం పరీక్షిస్తోంది ఇన్స్టాగ్రామ్. ఇంతకీ ఆ అప్డేట్ ఏంటంటే..
తల్లిదండ్రులకు ఇదో హెచ్చరిక.. స్మార్ట్ఫోన్ల వల్ల పిల్లలతో బంధానికి ప్రమాదం.. ఎంత ప్రభావం చూపుతోందంటేఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో ప్రస్తుతం 15 సెకన్ల వీడియో మాత్రమే నిరంతరాయంగా వస్తోంది. ఒకవేళ అంతకంటే ఎక్కువ నిడివి ఉన్న వీడియోను అప్లోడ్ చేస్తే.. 15 సెకన్లకు ఒక సెగ్మెంట్ గా విడిపోతోంది. వేర్వేరు స్టోరీస్ గా విడిపోతోంది.
ఇది యూజర్లకు అసౌకర్యంగా అనిపిస్తోంది. ముఖ్యంగా ఎవరినైనా ట్యాగ్ చేస్తే ఇది చాలా ఇబ్బందిగా మారుతోంది. అందుకే స్టోరీస్‌లో వీడియోలకు ఎక్కువ వ్యవధి ఉంటే బాగుంటుందని యూజర్లు ఎప్పటి నుంచో కోరుకుంటున్నారు. చాలా మంది సోషల్ మీడియా వేదికగా ఇన్స్టాగ్రామ్ కు సూచనలు చేశారు. మొత్తంగా యూజర్ల అభిప్రాయం తెలుసుకున్న ఇన్‌స్టా త్వరలోనే కొత్త సదుపాయాన్ని కల్పించేందుకు సిద్ధమవుతోంది.
ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో 60సెకన్ల నిడివి ఉన్న వీడియో నిరంతరాయంగా ప్లే అయ్యే సదుపాయాన్ని తీసుకొచ్చేందుకు సంస్థ ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించిన టెస్టింగ్ కూడా టర్కీలో మొదలుపెట్టేసింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా కన్సల్టెంట్ మాట్ నవర్రా వెల్లడించారు.
స్టోరీస్ సెగ్మెంట్ ను 60 సెకన్ల వరకు పెంచే ఫీచర్ ను ఇన్స్టాగ్రామ్ టెస్ట్ చేస్తోందంటూ ట్వీట్ చేశారు. టెస్టింగ్ పూర్తయ్యాక త్వరలోనే ఇన్స్టాగ్రామ్ యూజర్లందరికీ ఈ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ముఖ్యంగా పోటీ యాప్స్ అయిన స్నాప్ చాట్, టిక్ టాక్ కు స్టోరీస్ విషయంలో దీటుగా నిలిచేందుకు ఇన్‌స్టా ఈ నిర్ణయం తీసుకుంది.
ఇటీవల ప్రవేశపెట్టిన లింక్ స్టిక్కర్ ఫీచర్‌ను తాజాగా మెరుగుపరిచింది ఇన్స్టాగ్రామ్. ఇష్టమైన కలర్, టెక్స్ట్ యాడ్ చేసుకునేందుకు అనుమతిస్తోంది. స్టోరీలపైన లింక్స్ షేర్ చేయాలనుకునే యూజర్లు తమ పర్సనల్ టెక్ట్స్ ను ఈ స్టిక్కర్లపై రాయవచ్చు. దీంతో స్టోరీస్ లో యూఆర్ఎల్స్ ను యూజర్లు మరింత ఆకర్షణీయంగా షేర్ చేసే అవకాశం వచ్చింది. అలాగే కలర్ కాంబినేషన్లను సొంతంగా సెట్ చేసుకునే సదుపాయం ఉండడంతో లింక్ టెక్స్ట్ బాగా కనిపించేలా కూడా చేసుకోవచ్చు.