నిరుద్యోగ బృతి…ఇంకా ఐదురోజులే….అప్లై చేసుకొనివారు ఇలా చేసుకోండి…!

New Government Website For Unemployment Benefits In AP Chief Minister Youth

గత ఎన్నికల్లో నిరుద్యోగులకి హామీ మేరకు నిరుద్యోగ భృతిని అందజేయడానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించిన విషయం తెలిసిందే. ముఖ్యమంత్రి యువనేస్తం పథకం పేరుతో అర్హులయిన నిరుద్యోగులకు వచ్చే నెల నుంచి నిరుద్యోగ భృతి చెల్లించనున్నారు. ముందుగా అక్టోబరులో ప్రాథమికంగా నాలుగు లక్షల మంది నిరుద్యోగులకు దీనిని చెల్లించేందుకు రూ.40 కోట్లను ప్రభుత్వం విడుదల చేసింది. ఈ పథకం కోసం బడ్జెట్‌లో కేటాయించిన రూ.1000 కోట్ల నుంచి ఈ మొత్తాన్ని డ్రా చేసుకునేందుకు రాష్ట్ర యువజన సంక్షేమ శాఖకు అనుమతించింది. ఈ మేరకు యువజన సంక్షేమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నిన్న ఉత్తర్వులను జారీ చేశారు.

cm-youva-nestham
నిరుద్యోగ భృతికి రూ.40 కోట్లు, పరిపాలనపరమైన ఖర్చులు, పథకం ప్రచారం కోసం రూ.6.67 కోట్లు, అలాగే ఆ పధకం వెబ్ సైట్ ఇతరత్రా నిర్వహణల మేరకు ఐటీ వారికి రూ.18లక్షలు మొత్తం కలిపి రూ.46.85 కోట్లు డ్రా చేసుకునేందుకు అనుమతించినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. మరోవైపు ముఖ్యమంత్రి యువనేస్తం పథకం కింద నిరుద్యోగభృతిని పొందేందుకు అర్హులు లక్ష మంది అయ్యారు. సెప్టెంబరు 14న రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభం నుంచి బుధవారం ఉదయానికి 3.87లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 1,05,444 మందిని అర్హులుగా గుర్తించినట్లు వెబ్‌సైట్‌లో వెల్లడించారు. ఈ పథకం కింద సుమారు 12లక్షల మందికి నిరుద్యోగభృతిని చెల్లించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. అర్హులైన వారికి అక్టోబరు 2న నిరుద్యోగభృతిని బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నారు.
http://yuvanestham.ap.gov.in/CMyuvaNapp/index.html

un-employement