ఇవాళ సాయంత్రం 7 గంటలకు ఈ వన్ ప్లస్ కొత్త స్మార్ట్ ఫోన్,టీవీ లాంచ్ఈవెంట్ ప్రారంభం కాబోతుంది. వన్ ప్లస్ 7టీ తో పాటు 7టీ ప్రో కూడా ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఈవెంట్ యూట్యూబ్ లోని వన్ ప్లస్ చానెల్ లో ప్రత్యక్షప్రసారం కాబోతుంది.
ప్రోమో టీజర్లు ముందే విడుదల చేశారు. ముందే విడుదలైన టీజర్లు, ఫొటోల ద్వారా వన్ ప్లస్ 7టీ వెనకవైపు మూడు కెమెరాలతో మే లో విడుదలైన వన్ ప్లస్ 7కి తర్వాత వెర్షన్ గా రాబోతుంది. తర్వాతి వెర్షన్ అయిన 7టీ ప్రో డిజైన్ వెర్షన్ కంటే కొత్తగా ఉండబోతుంది.
ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న వన్ ప్లస్ టీవీ విషయానికి వస్తే ఎంఐ టీవీల ధరల కంటే ఎక్కువగా శాంసంగ్, సోనీల కంటే ధర కొంచెం తక్కువగానే ఉండనుంది.ఇవి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ లో అందుబాటులో ఉండనున్నాయి. శబ్ద అనుభూతి ఎక్కువ ఉండేలా ఎనిమిది స్పీకర్లను ఇందులో అందించనున్నది.ఇది 55 అంగుళాల క్యూఎల్ఈడీ ప్యానెల్ ఉన్న టీవీ, ఇదే కాకుండా 43 నుండి 75 అంగుళాల వరకు మొత్తం 4 సైజుల్లో ఈ టీవీలు రానున్నాయి.