అన్‌లాక్– 3 సడలింపులతో ప్రజలు బిజీగా మారగా, కరోనా కేసులు ఊగిసలాడుతున్నాయి. ఒకరోజు ఎక్కువగా, మరో రోజు తక్కువగా నమోదవుతున్నాయి. తాజాగా గత 24 గంటల్లో రాష్ట్రంలో కొత్తగా 3,104 పాజిటివ్‌లు వచ్చాయి. మరణాలు కూడా గత మూడురోజుల కంటే పెరిగి మరో 92 మంది మృత్యువాత పడ్డారు. 4,992 మంది కోలుకున్నారు. ఇప్పటివరకు మొత్తం 28.59 లక్షల మందికి కరోనా సోకగా 35,526 మంది మరణించారు.
27.84 లక్షల మంది కోలుకోగా, ఇంకా 40,016 మంది కోవిడ్ రోగులు ఉన్నారు. పాజిటివిటీ రేటు కొంచెం పెరిగి 2.65 శాతాన్ని తాకింది. మరణాల రేటు 2.96 శాతంగా రికార్డయింది. తాజాగా 2,28,266 మందికి కోవిడ్ వ్యాక్సిన్ వేయగా, 1,16,912 మందికి కోవిడ్ నిర్ధారణ పరీక్షలను చేపట్టారు. రాష్ట్రంలో 725 డెల్టా, 2 రెండు డెల్టాప్లస్ కేసులు ఉన్నాయి. బెంగళూరులోనూ కేసులు పెరిగి 715 మందికి కరోనా సోకింది. 1,863 మంది కోలుకున్నారు. 15 మంది మరణించారు. బెంగళూరులో 14,232 క్రియాశీలక కేసులు ఉన్నాయి.