తమన్‌కు నవ్వాలో, ఏడ్వాలో అర్థం కావడం లేదు. ఎందుకో తెలుసా!.. తమన్ కంపోజ్ చేసిన ఓ హిట్ ట్యూన్‌ను స్టార్ హీరోయిన్ పాడటం. అయితే ఇక్కడ అసలు సమస్య ఏంటంటే, కీర్తిసురేశ్ పాడిన ఈ సాంగ్ 1998లో విడుదలైన హాలీవుడ్‌కి చెందిన ‘బెల్లా చావో’ అనే ఆల్బమ్‌లోనిది. అందులోని ట్యూన్‌ని తమన్ కాపీ కొట్టి మహేశ్, పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో వచ్చిన బిజినెస్‌మేన్‌లో ఉపయోగించుకున్నాడు. ఈ ట్యూన్ కాపీ విషయంపై అప్పట్లో పెద్ద రగడే జరిగింది. అందరూ సైలెంట్ అయిపోయిన తర్వాత కీర్తిసురేశ్ పుణ్యమాని మరోసారి నెటిజన్స్ దగ్గర తమన్ బుక్ అయ్యాడు.
కీర్తిసురేశ్ గిటార్ వాయిస్తూ బెల్లా చావో ఆల్బమ్‌ను హమ్ చేసింది. ఆ హమ్మింగ్ వీడియోను తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమెతో పాటు ఆమె పెంపుడు కుక్క నైకే కూడా ఉంది. కీర్తి సదరు వీడియో పోస్ట్ చేసిన కొంత సేపటికి నెటిజన్స్ తమన్‌పై తమదైన రీతిలో ట్యూన్ కాపీ కొట్టాడంటూ కామెంట్స్ చేయడం మొదలు పెట్టారు. ఇక్కడ ప్రస్తావించాల్సిన విషయమేమంటే.. కీర్తి పాడిన పాట వీడియో చూసిన మరో స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీ ప్రసాద్ ట్విట్టర్‌లో స్పందించారు.
‘మేం నీ పాటను కూడా వింటున్నాం. అయితే వయొలిన్ గిటార్‌గా ఎప్పుడు మారింది’ అని అన్నాడు. ‘ఏదో తమాషాగా చేశాను’ అంటూ దేవిశ్రీ ప్రసాద్‌కి కీర్తి రిప్లయ్ ఇచ్చింది.అసలే కాపీ ట్యూన్ అని నెటిజన్స్ చావగొడుతున్నారని తమన్ ఫీల్ అవుతుంటే ..పుండు మీద కారం చల్లినట్లు దేవిశ్రీ ప్రసాద్ దానికి రిప్లయ్ ఇవ్వడం మరింత బాధగా మారింది. దేవిశ్రీ ఎంట్రీతో నెటిజన్స్ చేస్తున్న రచ్చ మరింత ఊపందుకున్నట్లయ్యింది. మరి దేవిశ్రీ ఈ వ్యవహారంలో తెలిసి స్పందించాడా? తెలియక స్పందించాడా? అనేది మిలియన్ డాలర్స్ ప్రశ్నే మరి.