New Record: ఫోర్బ్స్‌ శక్తిమంతుల జాబితాలో వరుసగా ఐదోసారి నిర్మలా సీతారామన్‌

Budget 2024: Center's focus on tourism development.. Lakshadweep as a tourist hub..
Budget 2024: Center's focus on tourism development.. Lakshadweep as a tourist hub..

మరో అరుదైన గౌరవాన్ని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ దక్కించుకున్నారు. వరుసగా ఐదో సారి ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళగా ఘనత సాధించారు. 2023 ఏడాదికి ఫోర్బ్స్ విడుదల చేసిన ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన 100 మంది మహిళల జాబితాలో ఆమెకు వరుసగా ఐదోసారి చోటు లభించింది. భారత్‌ నుంచి మొత్తం నలుగురు మహిళలకు చోటు దక్కంది. వారిలో నిర్మలా సీతారామన్‌ మొదటి స్థానంలో ఉన్నారు. ప్రపంచవ్యాప్త జాబితాలో నిర్మలమ్మ 32వ స్థానంలో ఉన్నారు. గతేడాది ఆమె 36వ స్థానంలో నిలిచారు.

భారత్​లో ఈ ఏడాది ఫోర్బ్స్ అత్యంత శక్తిమంతమైన మహిళ జాబితాలో ఉన్నది వీరే

* హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌ ఛైర్‌పర్సన్ రోష్నీ నాడార్‌ మల్హోత్రా (60వ స్థానం)
* స్టీల్ అథారిటీ ఆఫ్‌ ఇండియా (SAIL) ఛైర్‌పర్సన్ సోమా మోండల్‌ (70వ స్థానం)
* బయోకాన్‌ వ్యవస్థాపకురాలు కిరణ్‌ మజూందర్‌ షా (76వ స్థానం)
* ప్రపంచవ్యాప్తంగా శక్తిమంతమైన మహిళల జాబితాలో మొదటి ఐదు స్థానాలు వీరివే

1. యూరోపియన్‌ కమిషన్‌ చీఫ్‌ ఉర్సులా వాన్‌ దెర్‌ లెయెన్‌
2. యూరోపియన్‌ సెంట్రల్‌ బ్యాంక్‌ అధిపతి క్రిస్టినా లగార్డ్‌
3. అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌
4.ఇటలీ ప్రధాని జార్జియా మెలోని
5. అమెరికా గాయని టేలర్‌ స్విప్ట్‌