అజ్ఞాతవాసి ఒక రోజు ముందే..!

new release date fixed for agnathavasi movie trailer

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 

పవన్‌ కళ్యాణ్‌, త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం విడుదల తేదీ దగ్గరకు వస్తుంది. ఈనెల 10న సంక్రాంతి సందర్బంగా విడుదల కాబోతున్న విషయం తెల్సిందే. భారీ స్థాయిలో అంచనాలున్న ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదల చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఇక ఈ చిత్రం ట్రైలర్‌ కోసం మెగా ఫ్యాన్స్‌ మరియు సినీ వర్గాల వారు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. విడుదలకు అయిదు రోజుల ముందు అంటే ఈనెల 5న ట్రైలర్‌ను విడుదల చేయాలని భావించారు. అయితే సినిమా విడుదలకు మరీ తక్కువ సమయం ఉండగా ట్రైలర్‌ను విడుదల చేయడం వల్ల ప్రమోషన్‌కు కాస్త ఇబ్బంది ఉండే అవకాశం ఉందని చిత్ర యూనిట్‌ సభ్యులు భావించినట్లుగా ఉన్నారు.

అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత చిత్ర ట్రైలర్‌ను ఒక రోజు ముందే అంటే ఈనెల 4 అంటే రేపు ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నారు. రేపు సాయంత్రం ఆరు గంటల సమయంలో అజ్ఞాతవాసి ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నట్లుగా చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. పవన్‌ స్థాయికి తగ్గట్లుగా దర్శకుడు త్రివిక్రమ్‌ చిత్రాన్ని తెరకెక్కించాడు. ఆ విషయం ట్రైలర్‌లో తేలిపోయే అవకాశం ఉంది. కీర్తి సురేష్‌ మరియు అను ఎమాన్యూల్‌లతో పవన్‌ చేసిన రొమాన్స్‌ కూడా సినిమాకు హైలైట్‌గా నిలుస్తుందని అంటున్నారు. ఇటీవలే విడుదలైన కొడకా కోటేశ్వరరావు అంటూ సాగిన పాట సూపర్‌ హిట్‌ అయ్యింది. సినిమా కూడా తప్పకుండా ఆకట్టుకుంటుందని మెగా ఫ్యాన్స్‌ చాలా నమ్మకంతో ఉన్నారు.