‘హౌరాబ్రిడ్జ్‌’ విడుదలకు సిద్దం

Rahul Ravindran howrah bridge movie release date

Posted [relativedate] at [relativetime time_format=”H:i”] 
రాహుల్‌ రవీంద్రన్‌ హీరోగా ఛాందిని చౌదరి హీరోయిన్‌గా యాదు దర్శకత్వంలో రూపొందిన ‘హౌరాబ్రిడ్జ్‌’ విడుదలకు సిద్దం అయ్యింది. ఇప్పటికే విడుదలైన టీజర్‌ మరియు పాటలు సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి. రెండు పాటలు కూడా సినిమా ఎంత రొమాంటిక్‌గా, ఎంత కూల్‌గా ఉంటుందో చెప్పకనే చెప్పాయి. ఇక ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకున్న నేపథ్యంలో చిత్ర యూనిట్‌ సభ్యులు ప్రెస్‌మీట్‌ ఏర్పాటు చేసి చిత్రంకు సంబంధించిన వివరాలను మీడియాతో పంచుకున్నారు.

ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ను జరుపుకుంటున్న ఈ చిత్రంను త్వరలోనే సెన్సార్‌ ముందుకు తీసుకు వెళ్లబోతున్నారు. సెన్సార్‌ కార్యక్రమాలను పూర్తి చేసి ఇదే నెలలో సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా దర్శకుడు యాదు పేర్కొన్నాడు. యూత్‌ ఆడియన్స్‌తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఈ చిత్రం ఉంటుందని హీరో రాహుల్‌ రవీంద్రన్‌ అంటున్నాడు. తనకు ఈ చిత్రం తెలుగులో తప్పకుండా మంచి బ్రేక్‌గా నిలుస్తుందని అన్నాడు.

హీరోయిన్‌ ఛాందిన చౌదరి మాట్లాడుతూ ఈ చిత్రం తర్వాత తాను రెగ్యులర్‌ కమర్షియల్‌ హీరోయిన్‌గా వరుసగా ఆఫర్‌లు దక్కించుకుంటాను అనే నమ్మకంతో ఉంది. దర్శకుడు కూడా ఈ చిత్రంపై చాలా ఆశలు పెట్టుకున్నాడు. సంక్రాంతి తర్వాత విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం యూత్‌ ఆడియన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాహుల్‌ రవీంద్రన్‌, ఛాందిని చౌదరిల మద్య ఉండే రొమాంటిక్‌ సీన్స్‌ ఇప్పటికే టీజర్‌ ద్వారా ఆకట్టుకున్నాయి. తప్పకుండా సినిమా కూడా ఆకట్టుకుంటుందనే నమ్మకంను సినీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు.