బన్నీ – త్రివిక్రమ్ సినిమా పై కొత్త రూమర్..?

Allu Arjun
Allu Arjun

స్టైలిష్ స్టార్ మరియు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ప్రస్తుతం శివకుమార్ దర్శకత్వంలో వహిస్తున్న బిజీగా ఉన్నాడు. ఐతే, ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో బన్నీ కొత్త ప్రాజెక్ట్ చేయబోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాని అనౌన్స్‌ కూడా చేశారు. త్రివిక్రమ్ రఫ్ గా ఈ సినిమా స్క్రిప్ట్ కూడా పూర్తి చేసినట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న అప్ డేట్ ప్రకారం.. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరో ఓ కీలక పాత్రలో నటించే ఛాన్స్ ఉందట. అతనిది హీరోకి తండ్రి పాత్ర అట.కాగా ఈ సినిమాలో సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ లో ఈ పాత్ర ఎంటర్ అవుతుందని టాక్. పైగా ఈ పాత్ర ట్రాక్ వెరీ ఎమోషనల్ గా ఉంటుందట. ఇంతకీ ఈ సినిమాలో కనిపించే ఈ పాత్రలో ఏ సీనియర్ హీరో కనిపిస్తాడో చూడాలి. కచ్చితంగా బాలీవుడ్ నుంచే ఓ హీరోని తీసుకునే ఆలోచనలో ఉన్నారు.

హారిక & హాసిని క్రియేషన్స్ మరియు గీతా ఆర్ట్స్ కలిసి భారీ బడ్జెట్ చిత్రాన్ని నిర్మించునున్నారు. ఈ సినిమాకి సంగీత దర్శకుడు థమన్‌ సంగీతం అదించబోతున్నాడు. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, మరియు అల వైకుంఠపురములో వంటి సూపర్ హిట్‌ల తర్వాత, అల్లు అర్జున్ – త్రివిక్రమ్ మరోసారి జత కట్టారు.