‘రాజమౌళి’ మూవీ పై కొత్త రూమర్..!

‘రాజమౌళి’ మూవీ పై కొత్త రూమర్..!
Cinema News

దర్శకధీరుడు రాజమౌళి – మహేష్ బాబు మూవీ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ? అంటూ మహేష్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది సమ్మర్ లోనైనా మహేష్ – జక్కన్న మూవీ కి సంబంధించిన అప్ డేట్ చెబుతారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. ఐతే, ఈ మూవీ గురించి తాజాగా ఒక రూమర్ వినిపిస్తోంది. మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ మూవీ ని పూజా కార్యక్రమాలతో స్టార్ట్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట

మొన్నటివరకూ తెలుగు నూతన సంవత్సరమైన ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న ఈ మూవీ ని అధికారికంగా లాంచ్ చేస్తున్నారు అని వార్తలు వినిపించాయి. ఇప్పుడు మళ్లీ ఆగస్టు 9న స్టార్ట్ చేస్తున్నారు అని టాక్ నడుస్తోంది. మరి ఈ రెండు తేదీల్లో ఏది నిజమో చూడాలి. ఇక ఆఫ్రికా బ్యాక్‌ డ్రాప్‌ లో అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఈ కథా నేపథ్యం సాగుతుందని తెలుస్తోంది.

‘రాజమౌళి’ మూవీ  పై కొత్త రూమర్..!
Rajamouli, Mahesh Babu

ఆ మధ్య విజయేంద్రప్రసాద్‌ ఈ మూవీ కథ గురించి ఒక ఇంటర్వ్యూలో చెబుతూ.. ‘నేను, రాజమౌళి ఇద్దరం దక్షిణాఫ్రికా నవలా రచయిత విల్బర్‌ స్మిత్‌ కి పెద్ద అభిమానులం. అందుకే ఆయన పుస్తకాల ఆధారంగానే ఈ మూవీ స్క్రిప్ట్ ని రాయాలనుకుంటున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. కాబట్టి రాజమౌళి – మహేష్ మూవీ ఒక అడ్వెంచర్ థ్రిల్లర్‌ గా ఉండబోతుంది.