షియోమీ ఇటీవలే మనదేశంలో రెడ్మీ నోట్ 10టీ 5జీ స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన సేల్ మనదేశంలో ఈరోజు జరగనుంది. అమెజాన్, ఎంఐ.కాంల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు. రెడ్మీ బ్రాండింగ్‌తో వచ్చిన మొదటి 5జీ ఫోన్ ఇదే. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో రెండు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో 4 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ ధర రూ.13,999గా ఉండగా, 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ ధర రూ.15,999గా ఉంది. క్రోమియం వైట్, గ్రాఫైట్ బ్లాక్, మెటాలిక్ బ్లూ, మింట్ గ్రీన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.ఈ ఫోన్‌ను హెచ్డీఎఫ్సీ బ్యాంకు క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,000 డిస్కౌంట్ లభించనుంది. అంటే రూ.12,999కే కొనుగోలు చేయవచ్చన్నమాట. దీనిపై నో కాస్ట్ ఈఎంఐ ఆప్షన్లు కూడా అందుబాటులో ఉన్నాయి.
ఇందులో 6.5 అంగుళాల ఫుల్ హెచ్డీ+ హోల్ పంచ్ అడాప్టివ్ డిస్ప్లేను అందించారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గానూ, యాస్పెక్ట్ రేషియో 20:9గానూ ఉంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. 6 జీబీ వరకు ర్యామ్, 128 జీబీ వరకు స్టోరేజ్‌ను ఇందులో అందించారు. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 18W ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. అయితే ఫోన్‌తో పాటు 22.5W ఫాస్ట్ చార్జర్‌ను అందించనున్నారు.
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఎంఐయూఐ ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. ఇక కెమెరాల విషయానికి వస్తే.. ఇందులో వెనకవైపు మూడు కెమెరాలను అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 48 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్ ఉండనున్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్‌ను అందించారు. ఫోన్ పక్కభాగంలో ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు. దీంతోపాటు ఫేస్ అన్‌లాక్ ఫీచర్ కూడా ఇందులో ఉంది.
ఐఆర్ బ్లాస్టర్, ఎన్ఎఫ్సీ, 4జీ ఎల్టీఈ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఇందులో ఉన్నాయి. యాక్సెలరమీటర్, యాంబియంట్ లైట్ సెన్సార్, గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ప్రాక్సిమిటీ సెన్సార్లు కూడా ఇందులో అందించారు. దీని మందం 0.92 సెంటీమీటర్లుగానూ, బరువు 190 గ్రాములుగానూ ఉంది.