ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనాను నివారించేందుకు అన్ని దేశాలు చివరి దశ వ్యాక్సిన్ ప్రయోగాల్లో బిజీగా ఉన్నాయి. అయితే కరోనా వైరస్ సరికొత్త లక్షణాలతో మానవాళికి కునుకు లేకుండా చేస్తుంది. మొదటగా జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తదితర లక్షణాలను కరోనా వైరస్‌గా శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే ఈ లక్షణాలతో అధిక సంఖ్యలో ప్రజలు బాధపడుతున్నారు. కానీ తాజాగా పర్సిస్టంట్ హిక్కప్స్(నిరంతర ఎక్కిళ్లు) కూడా కరోనా ముఖ్య లక్షణాలలో ఒకటని పరిశోధకులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో కుక్ కౌంటీ హెల్త్ డిపార్ట్‌మెంట్ పరిశోధకులు చెబుతున్న వివరాల ప్రకారం ఏ కారణం లేకుండా నాలుగు రోజులు ఎక్కిళ్ల సమస్య వేదిస్తుంటే కచ్చితంగా కరోనా పరీక్షలు చేసుకోవాలని సూచిస్తున్నారు. ఈ సమస్యతో పాటు కొద్ది వారాలుగా బరువు తగ్గడం, పరిశోధకులు చెబుతున్నట్లుగా శ్వాసకు సంబంధించిన సమస్యలు నిరంతరం వేదిస్తుంటే ప్రజలు జాగ్రత్త పడాలని తెలిపారు. కానీ కొందరు శాస్త్రవేత్తలు మాత్రం ఈ అంశంపై భిన్నాభిపప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
కొందరు శాస్త్రవేత్తలు వ్యతిరేకిస్తుంటే, మరికొందరు సమర్థిస్తున్నారు. కాగా ఇటీవల కొన్ని సంస్థలు జీర్ణ సమస్యలు కూడా కరోనా లక్షణంగా గుర్తుంచిన విషయం తెలిసిందే. కాగా ఆరోగ్య నిపుణులు మాత్రం సామాజిక దూరం, మాస్క్ ధరించడం, నిరంతరం చేతులను శుభ్రం చేసుకోవడంతోనే ప్రజలు కరోనా మహమ్మారిని ఎదుర్కొవచ్చని సూచిస్తున్నారు.