టాలీవుడ్ డ్రగ్స్ కేసులో కొత్త ట్విస్ట్ ఇచ్చిన సిట్

in drugs case, police are using Tollywood celebrities to save authors

రెండేళ్ల క్రితం టాలీవుడ్ ప్రముఖులపై నమోదు చేసిన డ్రగ్స్ కేసు దర్యాప్తు ఇంకా కొనసాగుతోందని తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు. ఈ కేసులో సినీ ప్రముఖులు సహా ఏ ఒక్కరికీ క్లీన్ చిట్ ఇవ్వలేదని చెప్పారు. డ్రగ్స్ కేసులో ఇప్పటి వరకు 7 ఛార్జిషీట్లు దాఖలయ్యాయని, ఇంకా 5 ఛార్జిషీట్లు త్వరలో దాఖలు చేస్తామని చెప్పారు. ఈ కేసులో సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోరెన్సిక్ ఆధారాలు వచ్చాయని అన్నారు. ఈ కేసుతో సంబంధం ఉన్న ఎవరినీ వదిలిపెట్టమని ఎక్సైజ్ అధికారులు చెప్పారు. కాగా, 2017లో టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు ప్రకంపనలు రేపింది. డ్రగ్స్ సరఫరాదారు అలెక్స్‌ను పోలీసులు పట్టుకోవడంతో సినీ తారల పేర్లు బయటకొచ్చాయి. ఈ కేసుపై ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో సిట్ నియమించి విచారణ చేపట్టారు. ర‌వితేజ‌, ఛార్మీ, పూరి జ‌గ‌న్నాధ్‌, న‌వ‌దీప్, త‌రుణ్‌, త‌నీష్‌, సుబ్బ‌రాజు, ముమైత్ ఖాన్ సహా పలువురు సెలబ్రిటీలను విచారించి..వారి నుంచి గోళ్లు, వెంట్రుకల నమూనాలను సేకరించారు. మొత్తం 12 కేసులు నమోదుచేసిన పోలీసులు ఇప్పటి వరకు 7 చార్జిషీట్లు దాఖలు చేశారు.