అజ్ఞాతంలో ఉన్న రవి ప్రకాష్ ఇంటర్వ్యూ…అందుకే నన్ను టార్గెట్ చేశారు ? 

నమోదయిన ఫోర్జరీ, డేటా చోరీ కేసుల్లో రవిప్రకాష్ విచారణకు రావాలని సైబరాబాద్ పోలీసులు ఎన్ని నోటీసులు ఇస్తున్నా రవిప్రకాష్ మాత్రం విచారణకు హాజరుకాలేదు. అయన ముందస్తు బెయిల్ కోసం చేసుకున్న పిటిషన్ కోసం కోర్టు విచారణకు అంగీకరించలేదు. కాగా ఇంతా జరుగుతుండగా మాట్లాడని రవిప్రకాష్ తాజాగా ఓ నేషనల్ వెబ్ సైట్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ ఇంటర్వ్యూలో ఆయన పలుఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. గతంలో రేవంత్ రెడ్డు మీద జరిగిన ఐటీ దాడులు అప్పుడే తమకు తమ చానెల్ లో మేజర్ షేర్స్ ని కొనుకున్న రామేశ్వర్ రావుకి ఇబ్బందులు తలెత్తాయని, రేవంత్ రెడ్డి మీద దాడిని ఆయన పొలిటికల్ కెరీర్ నాశానం చేసేందుకు వాడలనుకున్నారని దానికి తాను ఒప్పుకోక పోవడంతో ఎడిటోరియల్ స్టాఫ్ ని మార్చే విషయం మీద పట్టుపట్టారని పేర్కొన్నారు. అలాగే కంపెనీ సెక్రటరీ దేవేందర్ అగర్వాల్ ని కిడ్నాప్ చేసిన కొందరు వ్యక్తులు కొన్ని పనులు చేయించడానికి ప్రయత్నించారని ఆయన ఆరోపించారు. ఇక తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో విద్యార్థుల ఆత్మహత్యలను ప్రశ్నిస్తూ తాను కథనాన్ని ప్రసారం చేశానని, ఆ కథనం తెలంగాణ ప్రభుత్వానికి నచ్చలేదని, అప్పటి నుంచి తనను టార్గెట్ చేశారని ఆయన ఆరోపించారు. తనను టార్గెట్ చేయడం వెనుక రాజకీయ, వ్యాపారపరమైన అజెండా ఉందని అన్నారు. తాను ఆ లైవ్ షో ప్రసారం చేసిన సమయంలో కూడా ప్రభుత్వాన్ని గురించి ప్రస్తావించలేదని, వ్యవస్థ వైఫల్యం పైనే ప్రశ్నించానని అయినా అది నచ్చని ప్రభుత్వం ఇలా తనను కార్నర్ చేసిందని రవి ప్రకాష్ చెప్పుకొచ్చారు.