సునంద కేసులో కొత్త ట్విస్ట్

New Twist In Sunandas Case

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

దేశవ్యాప్తంగా కలకలం రేపిన మాజీ కేంద్రమంత్రి శశిథరూర్ భార్య సునందా పుష్కర్ హత్య కేసు విచారణ సరిగా జరగడం లేదా. అందుకు అధికారులు తమ వంతు పాత్ర పోషిస్తున్నారా.. అంటే అవుననే చెబుతున్నారు బీజేపీ సీనియర్ నేత సుబ్రహ్మణ్యస్వామి. ఇప్పటికే పలు ఆధారాలు మాయం చేశారని, ఏకంగా విచారణను పక్కదోవ పట్టించడానికి పొలిటికల్ ఒత్తిళ్లు తెస్తున్నారని మండిపడ్డారు.

దేశ రాజధానిలో చనిపోయిన వ్యక్తి మృతి కేసు దర్యాప్తుకు మూడేళ్లైనా సమయం చాల్లేదా అని స్వామి ప్రశ్నిస్తున్నారు. పోలీసుల సాగదీతతో కేసు నీరు కారుతోందని, అటు సునంద భర్త శశి థరూర్ తన వీఐపీ కల్చర్ తో అందర్నీ బెదిరిస్తున్నారన్నారు. ఇప్పటికే సాక్షాలు నాశనం చేయడంతో పాటు.. విచారణ అధికారుల్ని ప్రభావితం చేసేలా లేఖలు రాస్తున్నారని మండిపడ్డారు.

శశి ఇంట్లో పనిమనిషి సత్యనారాయణ సింగ్ ను సుదీర్ఘంగా విచారించడంపై థరూర్ అభ్యంతరం వ్యక్తం చేయడం దుమారం రేపుతోంది. ఆయన ఉన్నతాధికారులకు రాసిన లేఖలో సత్యనారాయణ సింగ్ ను హింసించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. కానీ విచారణ సమయంలో ఇలాంటి లేఖలు రాయడం ఎంతవరకు కరెక్టని ప్రశ్నిస్తున్నారు స్వామి.