విశాఖ స్కామ్ ఏ తీరానికి చేరునో..?

Vishakha Scam details And Consequences

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

విశాఖ బూములపై సిట్ వేసిన ప్రభుత్వ నిర్ణయానికి అనూహ్య మద్దతు దక్కుతోంది. గతంలో ఏ కేసులోనూ లేని విధంగా సామాన్యుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. పలు సంస్థలు, వ్యక్తులు, ప్రభుత్వ శాఖలు కూడా సిట్ కు ఆధారాలు సమర్పించడం విశేషంగా చెప్పుకుంటున్నారు. ఈ స్థాయిలో సామాజిక స్పృహ చాలా అరుదుగా కనిపిస్తుంటుంది.

విశాఖ బ్రాండ్ కాపాడాలన్న బాబు పిలుపుకు మంచి స్పందన వస్తోంది. విశాఖ వాసులు చురుగ్గా స్పందించి ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఏం చేసైనా సరే .. తమ సిటీ పేరు నిలబెట్టాలనే మాట అందరిలో వినిపిస్తోంది. దీంతో సిట్ పని తేలికవుతుంది. డ్రగ్స్ కేసులో ఆధారాల కోసం తెలంగాణ సిట్ అష్టకష్టాలు పడుతుంటే.. విశాఖ సిట్ మాత్రం ఆఫీసులో కూర్చునే సాక్ష్యాలు సేకరించడంపై తెలంగాణలోనూ చర్చ జరుగుతోంది.

విచారణను కొత్త పుంతలు తొక్కించిన ఏపీ పోలీస్ అధికారులు, రెవిన్యూ, స్టాంపులు అండ్ రిజిస్ట్రేషన్ తో కలిసి సిట్ ఏర్పాటు చేసి అనుకున్న ఫలితం సాధిస్తున్నారు. అన్యాక్రాంతమైన ప్రభుత్వ, ప్రైవేట్ భూముల నిగ్గు తేలుస్తున్నారు. అందుకే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న ప్రతిపక్షాలు కూడా సిట్ కు ఆధారాలిస్తున్నాయి. సిట్ ఏమీ చేయదంటూనే.. సాక్ష్యాలు ఇవ్వడమెందుకని టీడీపీ నేతలు విపక్షాల్ని నిలదీస్తున్నారు.