అనిమల్ ఓటిటి రిలీజ్‌పై కొత్త ట్విస్ట్..

అనిమల్ ఓటిటి రిలీజ్‌పై కొత్త ట్విస్ట్..
Cinema News

బాలీవుడ్ సూపర్ స్టార్ రణబీర్ కపూర్ హీరోగా రష్మికా మందన్నా హీరోయిన్ గా మన టాలీవుడ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగ తెరకెక్కించిన సెన్సేషనల్ హిట్ మూవీ “అనిమల్”. మరి గత ఏడాది డిసెంబర్ లో రిలీజ్ అయ్యిన ఈ మూవీ భారీ వసూళ్లు అందుకొని రణబీర్ సహా సందీప్ కెరీర్ లో రికార్డు గ్రాసర్ గా నిలిచింది. ఇక థియేట్రికల్ రన్ తర్వాత ఫైనల్ గా ఈ మూవీ ఓటిటిలో రిలీజ్ కి దగ్గరకి వస్తుంది.

ఈ మూవీ హక్కులు నెట్ ఫ్లిక్స్ తీసుకోగా ఇందులో ఈ చిత్రం జనవరి 26న వస్తున్నట్టుగా టాక్ ఉంది. కానీ ఈ రిలీజ్ ఆపాలి అంటూ ఈ మూవీ నిర్మాణ సంస్థ సినీ 1 స్టూడియోస్ వారు కేసు వేసిన విషయం వైరల్ గా మారింది. అనిమల్ మూవీ నిర్మాణంలో తాము ఒక భాగం కానీ తమకి ప్రాఫిట్స్ పంచడంలో కానీ మరికొన్ని పనులు మాకు చెప్పకుండానే టి సిరీస్ వారు చేసారని అందుకే అనిమల్ ఓటిటి రిలీజ్ ఆపాల్సిందే అంటూ ట్విస్ట్ ఇచ్చారు.

అనిమల్ ఓటిటి రిలీజ్‌పై కొత్త ట్విస్ట్..
Animal Movie

కానీ టి సిరీస్ తరపు న్యాయవాదులు మాత్రం ఈ మూవీ హక్కులని సినీ 1 వారు టి సిరీస్ కి 2.2 కోట్లకు వదులుకున్నారన్న విషయాన్ని దాచి ఇప్పుడు ప్రాఫిట్స్ వచ్చాయని అడుగుతున్నారని ఈ మూవీ కి వారికి సంబంధం లేదని సూచించారని తెలుస్తుంది. దీనితో ఢిల్లి హై కోర్ట్ వారు క్లారిటీ ఇవ్వాలని సినీ 1 సంస్థకి సూచించి ఈ కేసుని జనవరి 18కి వాయిదా వేసారట. దీనితో ప్రస్తుతానికి అనిమల్ ఓటిటి రిలీజ్ వాయిదా పడినట్టే అనిపిస్తుంది.