కొత్త సంవత్సర వేడుకల సమయంలో ప్రతి గంటకు 1,722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్లు వచ్చాయని స్విగ్గీ ఇన్ స్టామార్ట్ తెలిపింది. మరోవైపు ఓయో రూమ్ బుకింగ్స్ రికార్డు స్థాయిలో ఒక్కరోజులో 6.2 లక్షలు జరిగాయి. గతంతో పోలిస్తే 37% బుకింగ్స్ అధికంగా జరిగాయి. గోవాలో 50%, నైనిటాల్ లో 60% అధికంగా రూమ్స్ బుక్ అయ్యాయి.
ఇక అటు కొత్త ఏడాది ప్రారంభంలో ఫుడ్ డెలివరీ ప్లాట్ ఫామ్ లకు రికార్డు స్థాయిలో ఆర్డర్లు వెల్లువెత్తుతాయి. 2015-20 మధ్య ఎన్ని ఆర్డర్లు బుక్ అయ్యాయో…. డిసెంబర్ 31న అన్ని ఆర్డర్లు వచ్చాయని జొమాటో కంపెనీ తెలిపింది. నూతన సంవత్సర వేడుకల్లో హైదరాబాద్ లోనే ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు స్విగ్గి తెలిపింది. ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని పేర్కొంది.