న్యూజిలాండ్ పేసర్ హమీష్ బెన్నెట్ అన్ని రకాల క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అతడు తన నిర్ణయాన్ని మంగళవారం వెల్లడించాడు. బెన్నట్ 2010లో అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం చేశాడు. న్యూజిలాండ్ తరపున 19 వన్డేలు,11 టీ20లు, ఒకఒక టెస్టులో బెన్నెట్ ప్రాతినిధ్యం వహించాడు. మూడు ఫార్మాట్లు కలిపి అతడు కేవలం 43 వికెట్లు మాత్రమే పడగొట్టాడు.అయితే అంతర్జాతీయ స్థాయిలో అతడు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేకపోయాడు. కాగా 2011 వన్డే ప్రపంచకప్‌లో న్యూజిలాండ్ జట్టుకు అతడు ఎంపికయ్యనప్పటికీ.. గాయం కారణంగా బెంచ్‌కే పరిమితమయ్యాడు.
“నాకు చిన్నతనం నుంచే క్రికెట్ అంటే మక్కువ. అయితే నేను నా కెరీర్లో ఈ స్థాయికి చేరుకుంటానికి కలలో కూడా అనుకోలేదు. నా క్రికెట్ కెరీర్ ఓల్డ్ బాయ్స్ తిమారు క్రికెట్ క్లబ్ నుంచి ప్రారంభమైంది. నా కెరీర్ ఇన్నాళ్లు మద్దతుగా నిలిచిన కాంటర్బరీ క్రికెట్,న్యూజిలాండ్ క్రికెట్ ధన్యవాదాలు. ముఖ్యంగా న్యూజిలాండ్ తరపున ప్రాతినిధ్యం వహించడం నాకు గర్వంగా ఉంది” అని బెన్నెట్ పేర్కొన్నాడు.