నేడు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

నేడు నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన కాసేపటికి సూచీలు ఒక్కసారిగా కిందకు పడిపోయాయి. అప్పటి నుంచి మార్కెట్ ముగిసే వరకు ఊగిసలాట దొరణి కనిపించి చివరకు నష్టాల్లో ముగిశాయి. లోహ ఇంధనం వంటి కీలక రంగాల్లో అమ్మకాలు వెల్లువేత్తడం, ఆసియా మార్కెట్లు నేడు మిశ్రమంగా కనిపించడంతో మదుపరులు ఆచితూచి దోరణితో వ్యవహరించారు. చివరకు, సెన్సెక్స్ 109.40 పాయింట్లు క్షీణించి 60,029.06 వద్ద ఉంటే, నిఫ్టీ 40.70 పాయింట్లు క్షీణించి 17,889.00 వద్ద ఉంది.

నేడు డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.71 వద్ద ఉంది. మారుతి సుజుకి, ఎన్‌టిపిసి, టైటాన్ కంపెనీ, ఎస్‌బీఐ, ఎల్ అండ్ టి షేర్లు నిఫ్టీలో ఎక్కువ లాభపడితే.. టాటా స్టీల్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టెక్ మహీంద్రా, జెఎస్ డబ్ల్యు స్టీల్, హిందాల్కో ఇండస్ట్రీస్ షేర్లు ఎక్కువ నష్టపోయిన వాటిలో ఉన్నాయి. మెటల్ రంగాలలో ఇండెక్స్ 1 శాతానికి పైగా పడిపోయింది. రియాల్టీ, పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ ఇండెక్స్ 2-3 శాతం పెరిగింది.