కాస్టింగ్‌ కౌచ్‌పై నిహారిక కామెంట్స్‌.. విమర్శలు

Niharika Sensational Comments On Casting Couch

మెగా బ్రదర్‌ కూతురు నిహారిక తాజాగా ‘హ్యాపీ వెడ్డింగ్‌’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హీరోయిన్‌గా నిహారిక మంచి పేరు తెచ్చుకున్నప్పటికి సినిమాకు మిశ్రమ స్పందన దక్కింది. తాజాగా ‘హ్యాపీవెడ్డింగ్‌’ చిత్రం ప్రమోషన్‌లో భాగంగా నిహారిక మీడియాతో మాట్లాడటం జరిగింది. మీడియా వారు కాస్టింగ్‌ కౌచ్‌ గురించి స్పందించాల్సిందిగా కోరగా అందుకు నిహారిక చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారంను రేపుతున్నాయి. ఆడవారు అందుకు ఓకే అనకుండా కాస్టింగ్‌ కౌచ్‌ ఎలా జరుగుతుందని చెబుతున్నారు. ఒక వేళ ఆమె నో చెబితే అప్పుడు రేప్‌ అవుతుందని, ఆమె సరే అన్నప్పుడు తప్పు ఒప్పుల గురించి ఇక్కడ చర్చ ఎక్కడిది అంటూ నిహారిక చెప్పుకొచ్చింది.

కాస్టింగ్‌ కౌచ్‌ అనేది తెలుగు సినీ పరిశ్రమలో లేదా ఇతర సినీ పరిశ్రల్లోనే కాదు, అన్ని రంగాలోల కూడా ఉందని, అన్ని సంస్థల్లో కూడా కాస్టింగ్‌ కౌచ్‌ ఉందని తనకు తెలిసిందని చెప్పుకొచ్చింది. మీడియాలో గత కొన్ని రోజులుగా వస్తున్న వార్తలు తనకు విష్మయాన్ని కలుగ చేస్తున్నాయిన అని, అమ్మాయి అమాయకత్వంతో ఓకే అనడం వల్లే తప్పుజరిగిపోతుందని, వారికి కాస్త అసలు లభించినట్లుగా అవుతుందని ఈ సందర్బంగా నిహారిక చెప్పుకొచ్చింది. స్టార్‌ కూతురు అవ్వడం వల్ల నిహారికకు ఈజీగా ఎంట్రీ దక్కింది. కాని ఇతరుల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుందని, కోఆర్డినేటర్లు వ్యవహరించే తీరు మీకు తెలియదు అంటూ కొందరు సినీ ఇండస్ట్రీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారు చెబుతున్నారు. నిహారిక వ్యాఖ్యలపై శ్రీరెడ్డి కూడా మండి పడుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో మంచు లక్ష్మి ఇలాంటి వ్యాఖ్యలే చేస్తే శ్రీరెడ్డి సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చిన విషయం తెల్సిందే.