శ్రీరెడ్డి ఒప్పుకుంటేనే అన్నీ జరిగాయంటున్న ప్రముఖ దర్శకుడు.

Bharathiraja Comments on Sri Reddy

సినీ నటి శ్రీరెడ్డి కాస్టింగ్ కౌచ్ కి సంబంధించి చేస్తున్న ఆరోపణల మంట టాలీవుడ్ లో చల్లారగానే తమిళ్ ఇండస్ట్రీలో వేడెక్కింది. ఇక్కడ మీడియా మద్దతు కోల్పోయాక తమిళ నటుల విషయాల మీద శ్రీరెడ్డి టార్గెట్ చేసింది. ఆ లిస్ట్ లో తమిళ ప్రముఖుల పేర్లు చాలా మందివి వున్నాయి. దీంతో సహజంగానే అక్కడ కూడా కొందరు శ్రీరెడ్డి మీద నిప్పులు చెరుగుతున్నారు. మరికొందరు ఆమెకు మద్దతు పలుకుతున్నారు. కొందరు అయితే ఏకంగా శ్రీరెడ్డి మీద పోలీస్ స్టేషన్ లోనే ఫిర్యాదు చేశారు. ఈ పరిస్థితుల్లో శ్రీరెడ్డి కి ఓ అవకాశం ఇస్తానని తమిళ టీవీ రంగంలో చురుగ్గా నిర్మాణం చేస్తున్న కుట్టి పద్మిని చెప్పడం విశేషం. శ్రీరెడ్డి ఎదుర్కొన్న పరిస్థితుల మీద కుట్టి పద్మిని కాస్త సానుభూతి వ్యక్తం చేశారు. పైగా కాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీ లో ఉందని కూడా కుట్టి పద్మిని ఒప్పుకున్నారు . ఈ మాటలతో కాస్త సాంత్వన పొందిన శ్రీరెడ్డి కి ఓ సీనియర్ దర్శకుడు మాత్రం షాక్ ఇచ్చారు.

తమిళ ఇండస్ట్రీ లో రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ మీద కూడా నెగటివ్ కామెంట్ చేసే ధైర్యం ఉన్న భారతీరాజా ఈ అంశంలో స్పందించారు. అయితే మొత్తం వ్యవహారాన్ని ఆయన లైట్ గా తీసిపడేశారు. ఇప్పుడు శ్రీరెడ్డి చెబుతున్న సీక్రెట్స్ అన్ని ఆమె ఇష్టంతోనే జరిగాయని కూడా ఆయన అంటున్నారు. ఎక్కడో జరిగే తప్పులకు ఇండస్ట్రీ మొత్తాన్ని టార్గెట్ చేయడం సమంజసం కాదని అంటున్నారు భారతీరాజా. అసలే శ్రీరెడ్డి ఫైర్ బ్రాండ్. భారతీరాజా కూడా వెనక్కి తగ్గే మనిషి కాదు. దీంతో ఈ వ్యవహారం ఎక్కడిదాకా పోతుందో అని తమిళ ఇండస్ట్రీ టెన్షన్ పడిపోతోంది.