‘రిపబ్లిక్’ ఈవెంట్‌లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్‌పై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ వైసీపీ కార్యకర్త, టాలీవుడ్ నటుడు పోసాని కృష్ణమురళి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రెస్ మీట్ పెట్టి మరీ జగన్‌తో నీకు పోలికేంటి అంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. దీంతో ఈ ఇష్యూ జనాల్లో హాట్ టాపిక్ అయింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ ఇష్యూపై మెగా డాటర్ నిహారిక మరింత ఘాటుగా రియాక్ట్ అయ్యారు. పోసాని కృష్ణ మురళిని వెంటనే మెంటల్ ఆస్పత్రిలో చేర్పించాలంటూ సంచలన కామెంట్స్ చేశారు.
పోసాని కృష్ణ మురళి సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లో కూడా మెంటల్ కృష్ణ అంటూ నిహారిక చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. పవన్ కళ్యాణ్ ‘రిపబ్లిక్’ సినిమా వేదికపై ఆడవాళ్లపై అనుచిత వ్యాఖ్యలు చేయలేదని నిహారిక చెప్పారు. జగన్‌ని పవన్ విమర్శించారనే పోసాని అలాంటి వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. పోసాని ఓ మానసిక రోగి అని, ఆయన్ను వెంటనే మెంటల్ హాస్పిటల్‌లో చేర్పించాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ ఇష్యూపై, పోసాని తీరుపై ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, అలాంటి వారిని అస్సలు వదలొద్దని నిహారిక కోరారు.
మరోవైపు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ పోసాని పై పవన్ కళ్యాణ్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. అక్కడక్కడా జనసేన కార్యకర్తలు పోసానిపై కేసులు కూడా పెట్టారు. దీంతో ఈ ఇష్యూ సినీ, రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయింది. ఒకరిపై ఒకరు వేసుకుంటున్న కౌంటర్లు, ఆ కామెంట్లు చూస్తుంటే ఇప్పుడు పోసాని Vs పవన్ కళ్యాణ్ అన్నట్లుగా మారిపోయింది పరిస్థితి. సోషల్ మీడియాలో పోసానిపై దుమ్మెత్తిపోస్తూ రెచ్చిపోయి కామెంట్స్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్.