నిఖిల్ ముద్ర మార్చాడు !

Nikhil Movie Name Changes

యంగ్ హీరో నిఖిల్ క‌థానాయ‌కుడిగా టి.ఎన్ సంతోష్ ద‌ర్శ‌క‌త్వంలో తమిళ చిత్రానికి రీమేక్ గా తెర‌కెక్కుతోన్న `ముద్ర` రిలీజ్ కు రెడీ అవుతోన్న స‌మ‌యంలో టైటిల్ విష‌యంలో వివాదం త‌లెత్తిన సంగ‌తి తెలిసిందే. అదే టైటిల్ ను నిర్మాత న‌ట్టి కుమార్ ఫిలిం ఛాంబ‌ర్ లో నిఖిల్ కంటే ముందుగా రిజిస్ట‌ర్ చేయించాడు. ఇదే నెల‌లో నిఖ‌ల్ సినిమా రిలీజ్ చేయాల‌న్న ఉద్దేశంతో త‌న సినిమా టైటిల్ ను న‌ట్టి కుమార్ ప్ర‌చారానికి వాడుకుంటున్నార‌ని ఆరోపించాడు. దీంతో న‌ట్టి నిఖిల్ పై నిప్పులు చెరిగాడు. నీకంటే ముందు నేనే టైటిల్ రిజిస్ట‌ర్ చేయించాను. నా ద‌గ్గ‌ర అధార‌లున్నాయి? నీ ఆధారాలు కూడా చూపించంటూ నిల‌దీసాడు. దీంతో నిఖిల్ ఒక్క‌సారిగా సెలైంట్ అయిపోయాడు. వెనక్కి తగ్గిన నిఖిల్ తాజాగా ముద్ర టైటిల్ ను మార్చేసి కొత్త టైటిల్ అర్జున్ సుర‌వ‌రంగా పెట్టారు. ఈ విష‌యాన్ని నిఖిల్ ట్విట‌ర్ ద్వారా తెలిపాడు. ఫ్రెష్ లుక్, ఫ్రెష్ టైటిల్ ఇదేనంటూ ప్రచారం మొదలు పెట్టింది యూనిట్. ఇందులో నిఖిల్ స‌ర‌స‌న లావ‌ణ్య త్రిపాటి న‌టిస్తోంది. త‌మిళ్ లో హిట్ అయిన క‌ళిద‌న్ సినిమా రీమేక్ ఇది. తాజాగా కొత్త డేట్ ను రివీల్ చేసారు. మార్చి 29న సినిమా రిలీజ్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు.