ఎస్పీ బాలు మీద పడ్డ నాగబాబు !

Nagababu Fair On SP Balasubramanyam

గాయ‌కుడు ఎస్.పి బాల‌సుబ్ర‌హ్మ‌ణ్యం ఇటీవ‌ల హీరోయిన్ల డ్రెస్సింగ్ సెన్స్ పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన సంగ‌తి తెలిసిందే. అవ‌కాశాల కోసం అందాలు చూపిస్తూ దిగ‌జారుతున్నారని, తెలుగు సంప్ర‌ద‌యాన్ని భ్ర‌ష్ర్టు ప‌ట్టిస్తున్నార‌ని ఆయన కామెంట్ చేశాడు. తాజాగా ఆ వ్యాఖ్య‌ల‌పై మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు `నా ఇష్టం` లో కౌంట‌ర్ వేసారు. ఆడ‌వారు ఎలాంటి డ్రెస్స‌లు వేసుకోవాలో చెప్ప‌డానికి మీరెవ‌రు? పిక్క‌లు క‌నిపించేలా పొట్టి దుస్తులు వేసుకునే వారిపైనే కాదు. ఒళ్లంతా కప్పుకున్న వారిపై అత్యాచారాలు జ‌రుగుతున్నాయి. ఆడ‌పిల్ల‌లు ఫ‌లానా దుస్తులు వేసుకోవ‌డం వారిప‌ట్ల మ‌గ‌వాళ్ల వక్ర బుద్దితో చూస్తున్నార‌న‌డం త‌ప్పు. వంక‌ర‌గా చూసే వాడు, కామంతో క‌ళ్లు మూసుకుపోయేవాడు ఎప్పుడూ అలాగే వ్య‌వ‌హ‌రిస్తాడు. ఎలాంటి బ‌ట్ట‌లైనా వేసుకునే హ‌క్కు ఆడ పిల్ల‌ల‌కి ఉంది. మ‌గాడ్ని ప్యాంట్ వేసుకోవ‌ద్దు. ఒళ్లంతా గోను సంచుల‌తో కూడిన డ్రెస్ వేసుకోండి అంటే వేసుకుంటారా? ప‌్యాంట్ మ‌న సంప్ర‌దాయం కాదు. లుంగీ క‌ట్టుకోండి అంటే క‌ట్టుకుంటారా? ఎక్కడున్నారండి ఇంకా. స‌మాజం చాలా అప్ డేట్ అయింది. ఎవ‌రిష్టం వ‌చ్చిన బ‌ట్ట‌లు వాళ్లేసుకోవ‌చ్చు. చెప్ప‌డానికి మీరేవ‌రు? అస‌లు ఆడ‌వాళ్లు అలాంటి బ‌ట్ట‌లేసుకున్నార‌ని మీకెలా? తెలిసింది. తేర‌గా క‌నిపించారు క‌దాని చూసి కళ్ళతోనే చప్పరించేసి ఆ తర్వాత స్టేజ్ ఎక్కి అలా ఉండకూడ‌దు. ఇలా ఉండ‌దంటూ కడీష‌న్లు పెడ‌తారా? అంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.