తార‌క‌ర‌త్నకి షాకిచ్చిన జీహెచ్ ఎంసీ !

GHMC Shocks Taraka Ratna

న‌టుడు తార‌క‌ర‌త్న రెస్టార్ రెంట్ ను జీహెచ్ ఎంసీ అధికారులు కూల్చి వేశారు. బంజారా హిల్స్ రోడ్డు నెంబ‌ర్ 12 లో గ‌ల డ్రైవ్ ఇన్ రెస్టారెంట్ పై అధికారులు క‌న్నెర్ర‌ జేసారు. హుటా హుటిన జేసీబీలు తీసుకొచ్చి కూల్చేసారు. విష‌యం తెలుసుకున్న దాని ఓనర్ తార‌క‌ర‌త్న వెంట‌నే ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని అధికారుల‌కు స‌ర్ది చెప్పే ప్ర‌య‌త్నం చేసారు. నిబంధ‌న‌ల‌కు విరుద్దంగా రెస్టారెంట్ న‌డుపుతున్నారే కార‌ణంగా కూల్చేస్తున్నామ‌ని అధికారులు వివ‌ర‌ణ ఇవ్వ‌గా కొంచెం స‌మ‌యంలో కావాల‌ని తార‌కర‌త్న అడిగారుట‌. అదే స‌మ‌యంలో రెస్టారెంట్ నిర్వాహ‌కులు అధికారుల‌తో వాగ్వివాదానికి దిగారు. రాత్రుళ్లు, మ‌ద్యం, సౌండ్స్ లో ఇబ్బందుల‌కు గురిచేస్తున్నార‌ని సోసైటీ స‌బ్యులు జీహెచ్ ఎంసీ అధికారుల‌కు ఫిర్యాదు చేయ‌డంతోనే చ‌ర్య‌ల‌కు దిగిన‌ట్లు చెప్పుకొచ్చారు. అయితే తార‌క‌ర‌త్న అంద‌కు కొంచె గ‌డువు కావాల‌ని కోర‌గా అధికారులు వినిపించుకోలేదని సమాచారం. తార‌క్ ర‌త్న సినిమాల్లేక కొన్నేళ్ల‌గా వ్యాపారాల్లోనే కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే. ఆయన నటించిన ప్రాణం ఖరీదు సినిమా రిలీజ్ కి సిద్దంగా ఉంది.