కంగనా సవాల్ ని క్రిష్ స్వీకరిస్తాడా ?

Will Krish Agrees Kangana's Challenge

డైరెక్ట‌ర్ క్రిష్‌, నటి కంగ‌నా ర‌నౌత్ మ‌ధ్య వివాదం సాగుతున్న సంగతి తెలిసిందే. సోనూసూద్ మ‌ణిక‌ర్ణిక నుంచి త‌ప్పుకోవ‌డంతో అత‌డు న‌టించిన స‌న్నివేశాల్ని సినిమా నుంచి కంగ‌న తొల‌గించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప్ర‌చారంపై స్పందించ‌మ‌ని ఓ విలేక‌రి ప్ర‌శ్నించ‌గా సోనూసూద్ ను పూర్తి రోల్‌లో చూపిస్తూ మ‌ణిక‌ర్ణిక లాంటి సినిమా క్రిష్ చేసి విజ‌యం సాధించాల‌ని కంగనా పెద్ద స‌వాలే విసిరింది. మ‌ణిక‌ర్ణిక స‌క్సెస్ క్రెడిట్ విష‌య‌మై ఆ ఇద్ద‌రి మ‌ధ్యా పెద్ద ఎత్తున ర‌చ్చ జరుగుతోంది. మ‌ణి క‌ర్ణిక ఇప్ప‌టికే బాక్సాఫీస్ వ‌ద్ద 50కోట్లు పైగా షేర్ వ‌సూలు చేసింది. ఈ స‌క్సెస్ క్రెడిట్ త‌న‌దే అంటూ కంగ‌న టేకోవ‌ర్ చేసేసింది.

మ‌రి ఈ స‌వాల్ ను క్రిష్ స్వీక‌రిస్తాడా? క‌్వీన్ కు చెంప పెట్టు లాంటి స‌మాధానం ఇస్తాడా? అంటూ టాలీవుడ్ లో కొత్త‌గా చ‌ర్చ మొద‌లైంది. వాస్తవానికి ఓ హీరోయిన్ నుంచి ఇలాంటి స‌వాల్ ఇప్ప‌టివ‌ర‌కూ ఏ ద‌ర్శ‌కుడికి ఎదురు కాలేదు. హీరో, ద‌ర్శ‌కుల మ‌ధ్య ఇలాంటి వివాదం కూడా ఎప్పుడూ త‌లెత్త‌లేదు. దీంతో క్రిష్ ట్యాలెంట్ కు కంగ‌న పెద్ద ప‌రీక్ష పెట్టింద‌ని మాట్లాడుకుంటున్నారంతా. మ‌రి దీనిపై క్రిష్ ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటాడో చూడాలి. ప్ర‌స్తుతం క్రిష్ బాల‌కృష్ణ క‌థానాయ‌కుడిగా `మ‌హానాయ‌కుడు` చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నాడు. ఆ సినిమా షూట్ లో బిజీగా ఉన్నాడు. క‌థానాయ‌కుడు ఆశించిన ఫ‌లితాన్నిక‌పోవ‌డంతో `మ‌హానాయ‌కుడు`తో స‌క్సెస్ అందుకుని ఆ లోటును పూరించాల‌ని రేయింబ‌వ‌ళ్లు శ్ర‌మిస్తున్నార‌ట‌. క‌నీసం మ‌హానాయ‌కుడు స‌క్సెస్ అయినా కంగ‌న‌కు చిన్న‌పాటి కౌంటర్ గా ఉంటుందేమో !