విజయ్ కి అరుదైన ఘనత !

Vijay Selected For Forbes Under 30 List

సినిమా ఇండస్ట్రీలో నిలదొక్కుకుని ఒక స్థానం సంపాదించాలంటే అంత ఈజీ కాదు. కాని విజయ్‌ దేవరకొండ విషయంలో అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది. అతి తక్కువ సమయంలో అగ్ర హీరోల సరసన స్థానం సంపాదించుకున్నాడు. ఎటువంటి సీన్లనైనా పండించడం విజయ్‌కు కొట్టిన పిండి. రెండు, మూడు సినిమాలకే స్టార్‌ హీరోకు వచ్చిన స్టార్‌ డమ్‌ వచ్చింది. తాజాగా విజయ్‌..ఫోర్బ్స్‌ 30 అండర్‌ 30 లో చోటు సంపాదించాడు. ఇటీవలే ఫోర్బ్స్‌ ఇండియా తన ఆరో ఎడిషన్‌ ప్రకటించింది.

ఇండియాకు చెందిన 30 ఏళ్ల లోపు వయసు ఉన్న వివిధ రంగాలకు చెందిన ప్రొఫెషనల్స్‌ను ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్‌ అండ్‌ మ్యూజిక్‌ కేటగిరిలో విజయ్‌ను ఎంపిక చేశారు. అర్జున్‌రెడ్డి సినిమా బ్లాక్‌ బస్టర్‌తో తెలుగు సినిమా చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖించాడని ఈ సందర్భంగా ఫోర్బ్స్‌ ఇండియా తెలిపింది.ఈ కేటగిరిలో విజయ్‌ తో పాటు ఇండియా నుండి యూట్యూబర్‌ ప్రజక్తా కొలి(25), సింగర్‌ మేఘనా మిశ్రా(17) ను ఫోర్బ్స్‌ ఎంపిక చేసింది.