ఫ్యాన్స్ కోసం సినిమా చేస్తున్న శంకర్ !

Shankar Plans A Movie With Vikram And Vijay Sons

రజనీకాంత్ తో ‘రోబో’కి సీక్వెల్ గా ‘2.ఓ’ చేసిన శంకర్, ఆ సినిమా తరువాత పెద్ద గ్యాప్ తీసుకోకుండా ‘భారతీయుడు’ సీక్వెల్ ను సెట్స్ పైకి తీసుకెళ్లాడు. కమల్ కాజల్ కాంబినేషన్లో ‘భారతీయుడు 2’ సినిమా షూట్ మొదలుపెట్టాడు. అయితే ఆ షూట్ ఆగడంతో ఆ సినిమాకి సంబంధించిన పనుల్లో ఆయన బిజీగా వున్నాడు. అయితే భారీ బడ్జెట్ తో కూడిన సినిమా కావడంతో, ఈ సినిమా పూర్తికావడానికి ఎక్కువ సమయంపట్టే అవకాశం వుంది. ఇక ఈ సినిమా తరువాత ప్రాజెక్టును కూడా శంకర్ లైన్లో పెట్టేశాడనే టాక్ కోలీవుడ్లో బలంగా వినిపిస్తోంది. భారతీయుడు 2 పూర్తయిన వెంటనే హీరో విజయ్ తనయుడు ‘జాసన్ సంజయ్’ .. హీరో విక్రమ్ తనయుడు ‘ధృవ్’ కథానాయకులుగా ఒక సినిమాను సెట్స్ పైకి తీసుకువెళ్లేలా ప్లాన్ చేసినట్టుగా చెప్పుకుంటున్నారు. ఇద్దరు స్టార్ హీరోల వారసులతో సినిమా అంటే సహజంగానే ఒక రేంజ్ లో క్రేజ్ వుంటుంది. నిజానికి ఆ ఇద్దరు హీరోల అభిమానులు కొట్టుకు చస్తూ ఉంటారు అలాంటిది ఆ ఇద్దరి హీరోల కొడుకులతో సినిమా చేస్తే ఆ గొడవలని కూడా కాస్త ఆపినట్టే. అంతా అనుకున్నట్టుగా జరిగితే ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు వస్తుందని చెప్పుకోవచ్చు.