టెలికం సంస్థలను ఆదుకొనున్న కేంద్రం

టెలికం సంస్థలను ఆదుకొనున్న కేంద్రం

కేంద్రం టెలికం కంపెనీలకు ఊరట ఇవ్వనుంది. కేంద్ర క్యాబినెట్ స్పెక్ట్రమ్ చెల్లింపులకు సంబంధించి రెండేళ్ల పాటు మోరటోరియం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. దీనితో టెలికం కంపెనీలకు ఊరట కలిగింది. 42,000 కోట్లకు పైగా స్పెక్ట్రం రుసుము రిలయన్స్ జియో, ఎయిర్టెల్, ఐడియా, వోడాఫోన్‌లు చెల్లించాలి. ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా టెలికం ఆపరేటర్లు ఆర్థిక సంక్షోభంలో ఉండగా ముఖ్యంగా వోడాఫోన్ తీవ్ర నష్టాల్లో మునిపోయింది. ఆపరేటర్ల మధ్య నెలకొన్న పోటీ వల్ల కంపెనీ చేతులెత్తేసి దేశం విడిచి వెళ్తున్నట్లు కథనాలు కూడా వినిపించాయి.

జియో లాభాలను పొందగా వోడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా నష్టాలను చూశాయి. కేంద్రం చేసిన ప్రకటనతో వోడాఫోన్, ఐడియా, ఎయిర్టెల్ కంపెనీలు ఊరట పొందాయి. ఆర్థిక శాఖా మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ టెలికం కంపెనీలు ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభాన్నిగురించి సీఓఎస్ సిఫారసులకు అనుగుణంగా నిర్ణయం తీసుకోబోతున్నాము అని తెలిపారు. స్పెక్ట్రం వేలం వాయిదాలని రెండేళ్ల పాటు వాయిదా వేయనున్నారని తెలిపారు. రాబోయే రెండు సంవత్సరాలకు కంపెనీలు స్పెక్ట్రం చెల్లింపులు లేవు.