రెండు సినిమాలు ప్రకటించిన నితిన్ !

Nithin

ప్రముఖ టాలీవుడ్ హీరో నితిన్‌ కొత్త సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతోంది. ‘రైడ్‌’, ‘వీరా’ సినిమాల దర్శకుడు రమేశ్‌ వర్మ దర్శకత్వంలో నితిన్‌ ఓ సినిమా చేయబోతున్నారు. రోమాంటిక్‌ డ్రామా గా ఈ సినిమా తెరకెక్కనుంది.  ఆగస్ట్‌లో ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభమవుతుంది. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించనుండగా, నటరాజన్‌ సుబ్రహ్మణ్యం సినిమాటోగ్రాఫర్‌గా పని చేస్తున్నారు. ‘ఇష్క్‌’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ సినిమాల తరహాలోనే ఈ కొత్త సినిమా ఉండబోతుందని సమాచారం. ఏ స్టూడియోస్‌ బ్యానర్‌పై హీరో హవీశ్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.  ప్రస్తుతం నితిన్‌ ‘భీష్మ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాలో నితిన్‌కు జోడీగా రష్మిక మందన నటిస్తున్నారు. ‘భీష్మ’ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్నారు. మార్చిలోనే తన కొత్త సినిమాల గురించి ప్రకటన చేస్తానని, అభిమానులు కాసింత ఓపిక పట్టాలని గతంలో నితిన్‌ కోరారు. ఈ రోజు హోలీ సందర్భంగా తన కొత్త చిత్రాన్ని ట్విట్టర్ ద్వారా ప్రకటించాడు. ట్యాలెంటెడ్ డైరెక్టర్ సాహసం ఫేమ్ చంద్రశేఖర్ యేలేటి తో ఒక సినిమా చేయనున్నాడు నితిన్. భవ్య క్రియేషన్స్ పతాకం ఫై ఆనంద్ ప్రసాద్ నిర్మించనున్న ఈ చిత్రం ఏప్రిల్లో సెట్స్ మీదకు వెళ్లనుందని ఎంఎం కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించనున్నాడని ట్వీట్ చేశాడు నితిన్. నితిన్ రెండు కొత్త సినిమాలపై స్పష్టత రావడంతో ఆయన అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.