యంగ్‌ హీరోకు సుక్కు లక్కు వర్కౌట్‌ అయ్యేనా?

Nithin Next Movie With Sukumar

యంగ్‌హీరో నితిన్‌ వరుస ఫ్లాపులతో డేంజర్‌ జోన్‌లో ఉన్నాడు. మిగతా యంగ్‌హీరోలంతా బ్లాక్‌ బస్టర్‌లతో దూసుకుపోతుంటే నితిన్‌కు మాత్రం ఈ ఫ్లాపుల గోల తప్పడం లేదు. నితిన్‌ ప్రస్తుతం ‘భీష్మ’ చిత్రంలో నటిస్తున్నాడు. అయితే ఈ ఫలితం ఎలా ఉండబోతుందో అని నితిన్‌ అభిమానులు టెన్షన్‌గా ఉన్నారు. ‘భీష్మ’ తర్వాత నితిన్‌ ఎలాగైనా బ్లాక్‌ బస్టర్‌ను దక్కించుకోవాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు మాంచి కాంబినేషన్‌ కూడా సెట్‌ అయ్యింది. నితిన్‌ తదుపరి చిత్రానికి కథ, స్క్రీన్‌ ప్లే సుకుమార్‌ది కాగా, ఈ చిత్రాన్ని ‘కుమారి 21ఎఫ్‌’ ఫేం సూర్య ప్రతాప్‌ తెరకెక్కించనున్నాడు. సుక్కు నితిన్‌ కోసం మంచి కథను రెడీ చేసే పనిలో పడ్డాడు. ఎలాగేనా నితిన్‌కు ఈ చిత్రంతో మంచి హిట్‌ అందేలా చూడాలని ప్లాన్‌ చేస్తున్నాడు.

Nithin

‘రంగస్థలం’ చిత్రాన్ని తెరకెక్కించిన సుక్కు నితిన్‌ కోసం కథ రెడీ చేస్తున్నాడు అనగానే అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. ఈ చిత్రాన్ని సుక్కు గీతా ఆర్ట్స్‌ 2తో కలిసి సంయుక్తంగా నిర్మించడానికి సిద్దమయ్యాడు. సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్‌, జీఎ 2 బ్యానర్‌లు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించనున్నారు. బన్ని వాస్‌ మరియు సుకుమార్‌ల కాంబో. అంతేకాకుండా సుకుమార్‌ కథ మరియు స్క్రీన్‌ ప్లే. తాజాగా నితిన్‌ ఎంపిక చేసిన యూనిట్‌ సభ్యులు ప్రస్తుతం కథను రెడీ చేసే పనిలో పడ్డారు. మొత్తానికి ఈ కాంబో చూస్తుంటే నితిన్‌కు మంచి హిట్‌ ఖాయమనిపిస్తుంది. అయితే నితిన్‌కు ఈ లక్‌ ఎంత వరకు వర్కౌట్‌ అవుతుందో చూడాలి మరి. నితిన్‌ ‘భీష్మ’ చిత్రం పూర్తి కాగానే సుక్కు చిత్రంలో పాల్గొననున్నట్టు తెలుస్తోంది.