మిషన్ మంగళ్ – నిత్య మీనన్ బాలీవుడ్ చిత్రం విశేషాలివిగో…!

Nithya Menon Next Bollywood Movie Mission Mangal

నిత్య మీనన్ బయోగ్రఫీ గురించి తెలిసిన తెలుగు ప్రేక్షకులకి నిత్య మీనన్ మళయాళ నటి అని తెలుసు కానీ సినిమా పరిజ్ఞానం అంతగా లేని సాధారణ ప్రేక్షకజనంకి మాత్రం నిత్య మీనన్ తెలుగు నటి మాత్రమే. అలా కాదు అని మీరు వాళ్ళతో వాదించాలని చూస్తే, “చూడు, తెలుగు ఎంత చక్కగా మాట్లాడుతుందో, తెలుగు పిల్ల కాదంటావేంటిరా బడవా” అని చీవాట్లు తినే అవకాశం కూడా ఉండొచ్చు. అలా మొదలయ్యింది సినిమాతో తెలుగులో తన ప్రయాణం ని మొదలెట్టి, ఆ తరువాత వరుసగా తమిళం, కన్నడం వంటి సినిమాల్లో నటించి, సౌత్ ఇండియన్ భాషలు అన్నింటిని కవర్ చేసింది.

Nithya-Menon

ఇక మిగిలింది హిందీ మాత్రమే అనుకొని, ఇప్పడు ఆ వైపుగా తొలి అడుగు వేసింది. గత కొన్ని సవంత్సరాలుగా బాలీవుడ్ నటులతో పోలిస్తే, విభిన్నమైన మరియు సోషల్ మెసేజ్ ఉన్న కథలను ఎంచుకొని, వరుస విజయాలతో ప్రేక్షకులను అలరిస్తున్న అక్షయ్ కుమార్ ‘మిషన్ మంగళ్’ అనే మరో డిఫరెంట్ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా కథాంశం 2013 లో ఇస్రో చేపట్టిన మంగళయాన్ మిషన్ నేపథ్యంలో నడుస్తుంది. జగన్ శక్తి అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఆర్. బల్కి (అక్షయ్ కుమార్ నటించిన పాడ్ మాన్ సినిమా దర్శకుడు) నిర్మిస్తున్నాడు. ఈ సినిమాతో నిత్య మీనన్ బాలీవుడ్ తెరగేంట్రం చేస్తుంది. మిషన్ మంగళ్ సినిమాలో సోనాక్షి సిన్హా, విద్యా బాలన్, తాప్సి పన్ను, కీర్తి కొల్హారి, శర్మాన్ జోషి వంటి భారీ తారాగణం నటిస్తుండడంతో ఈ సినిమాపై ఆసక్తి మొదలయ్యింది. అక్షయ్ కుమార్ విలన్ గా నటిస్తున్న రోబో 2.0 చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Mission-Mangal-movie