దేవ్ టీజర్ టాక్: కార్తీ డిఫరెంట్ గా కనపడుతున్నాడుగా…!

Karthi Dev Teaser Talk

తమిళ హీరో కార్తీ కి తమిళంలో ఎంత పేరు ఉందో, అంతే తెలుగులో కూడా ఉంది. చెప్పాలంటే తెలుగులో ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలో తన అన్న సూర్య ని మించిపోయాడు. దానికి కారణం సూర్య ఎప్పుడు డిఫరెంట్ సినిమాలు చేస్తూ, ఫ్యామిలీ ఆడియన్స్ టేస్ట్ లకి అందకపోవడం తో పాటు, ఊపిరి అనే డైరెక్ట్ తెలుగు సినిమాలో నాగార్జున తో పాటు నటించి తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వడం. సూర్య సినిమాలు ఎన్నో తెలుగు లో డబ్ అయినా, ఏదో గ్యాంగ్ అనే సినిమాకి తెలుగు లో డబ్బింగ్ చెప్పుకున్నాడేమో కానీ, కార్తీ మాత్రం తన ఆవారా సినిమా నుండి తన పాత్ర కి తానే డబ్బింగ్ చెప్పుకుంటూ, తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు.

karthi

తాజాగా కార్తీ నటించిన ‘దేవ్’ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఈ టీజర్ ని చూస్తే, ఈ సినిమా కార్తీ చేసిన ఇదివరకటి సినిమాలకు పూర్తి భిన్నంగా కనిపిస్తుంది.. “ఈ లోకంలో బ్రతకడానికి ఎన్నో దారులున్నాయి. ఎవరో చెప్పారని అర్థంకాని చదువు చదివి ఇష్టం లేని ఉద్యోగం చేసి ముక్కూ మొహం తెలియని ఓ నలుగురు మెచ్చుకోవాలని కష్టపడి పని చేసి ఈగో ప్రెషర్ కాంపిటీషన్ లో ఇరుక్కుని అంటీ అంటనట్టు లవ్ చేసి.. ఏం జరుగుతోందో అర్థం కాకుండా బతకడం ఓ దారి…….ఇంకో దారుంది” అనే ఫిలసాఫికల్ డైలాగ్ తో మొదలైన ఈ సినిమాలో బైక్ రేసింగ్లు, కార్ ఛేసింగ్లు, లవ్, రొమాంటిక్ సీన్లు, ఫైట్లూ వంటి అన్నింటిని రంగరించి సినిమా తీసినట్టు తెలుస్తుంది. ఈ సినిమాలో కార్తీ సరసన రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా మరోసారి నటిస్తుంది. వీరిద్దరూ ఇప్పటికే ఖాకీ అనే హిట్ సినిమాలో నటించారు. టీజర్ లో కనిపించిన రకుల్ ప్రీత్ సింగ్ చాలా సన్నగా, ఇదివరటితో పోలిస్తే నాజూకు గా కనిపించింది. వీరిద్దరి రొమాన్స్ కూడా ఖాకీ సినిమాని మరోసారి గుర్తుకుతెచ్చింది. హరీష్ శంకర్ అందించిన సంగీతం ఈ టీజర్ కి హైలైట్ గా చెప్పుకోవచ్చు. రజత్ రవిశంకర్ అనే నూతన దర్శకుడు తెరకెక్కిస్తున్న ఈ సినిమాని ఠాగూర్ మధు మరియు రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ లు కూడా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.