ఎన్డీఏకు షాకిస్తున్న తటస్థులు

nitish-kumar-and-other-parties-showing-calmness-in-vice-president-election

Posted [relativedate] at [relativetime time_format=”H:i”]

రాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఎన్డీఏకు మద్దతిచ్చిన తటస్థ పార్టీలు .. ఉపరాష్ట్రపతి రేసుకొచ్చేసరికి మెల్లగా సైడైపోతున్నాయి. అఫ్ కోర్స్ వీటి మద్దతు లేకపోయినా.. వెంకయ్య గెలుపుకు ఢోకా లేదనుకోండి. కానీ రాష్ట్రపతి ఎన్నికల వ్యూహం.. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో పనిచేయకపోవడాన్ని అమిత్ షా సీరియస్ గా తీసుకున్నారు. లెక్క ఎక్కడ తప్పిందనేది కసరత్తు చేస్తున్నారు.

రాష్ట్రపతి ఎన్నికల్లో అభ్యర్థి ఎంపికపై దూకుడుగా ప్రవర్తించిన కేంద్రం.. ఉపరాష్ట్రపతికి వచ్చేసరికి నత్తను తలపించేలా నిర్ణయాలు తీసుకుంది. అసలు రాష్ట్రపతి అభ్యర్థి సమయంలోనే ఉపరాష్ట్రపతి అభ్యర్థిని ప్రకటించాల్సిందని బీజేపీ నేతలు చాలా మంది భావిస్తున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాలు ముందుగా గాంధీ అభ్యర్థిత్వం ప్రకటించడం, నితీష్ ఆయనకు జై కొట్టడం జరిగిపోయింది.

ఇప్పుడు బీజేడీ కూడా గాంధీకి జై కొట్టింది. అయితే ఇక్కడ రాజకీయ కారణాలు కాకుండా వ్యక్తిగత సంబంధాలే ప్రభావం చూపాయి. గాంధీతో తనకు సీఎం కాక ముందు నుంచే స్నేహం ఉందని, అందుకే ఆయనకు మద్దతిస్తున్నానని, ఇందులో ఎలాంటి వ్యూహం లేదని స్పష్టం చేశారు ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్. కనీసం వైసీపీ, టీఆర్ఎస్, అన్నాడీఎంకే అయినా మద్దతు ఉండటం అమిత్ షా కు ఊరట కలిగించే విషయమే.

మరిన్ని వార్తలు: