మరో సారి ‘యారి’ మ్యాజిక్ చేసేందుకు సిద్దమైన రానా…!

No.1 Yaari Season Two With Rana

బాహుబలి, నేనే రాజు నేనే మంత్రి లాంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకుల మదిని దోచిన రానా సరిగ్గా ఏడాది క్రితం మనందరిని నెంబర్ వన్ యారి అంటూ చేసిన అల్లరి గుర్తుండే ఉంటుంది కదూ. ఆ అల్లరి మళ్ళీ మొదలవబోతోంది ఆండోయ్. మళ్ళీ రానా వ్యాఖ్యాతగా నెంబర్ వన్ యారి సెకండ్ సీజన్ మొదలవబోతోంది. దీనికి సంబందించిన కర్టెన్ రైజర్ ఈవెంట్ నిన్న ఫిలిం నగర్ లోని రామానాయుడు స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. గత ఏడాది ఎన్టీఆర్, రాణాలు ఒకే సమయంలో షోలలో పాల్గొన్నారు. ఒకరు బిగ్ బాస్ మరొకరు యారి విత్ రానా. అయితే మాస్ ఇమేజ్ తో పోలుచుకున్నా, సీనియారిటీతో పోల్చుకున్నా, ఫ్యాన్ ఫాలోయింగ్ విషయంలోను(లేడీ ఫ్యాన్స్ ని మినహాయించి) ఎన్టీఆర్ కన్నా రానా కాస్త తక్కువేనని చెప్పాలి.
అయితే ఆ సమయమ్లో బుల్లి తెర మీద మాత్రం ఎన్టీఆర్ పై రానా పై చేయి సాదించాడు. ఇంచుమించుగా ఈ రెండు షోలు ఒకేసారి ప్రారంభం అయ్యాయి.

ఈ రెండు షోల టీఆర్.పి రేటింగ్ ల విషయంలో రానా షో బిగ్ బాస్ ని దాటేసి అప్పట్లో రికార్డు సృష్టించింది. దీంతో ఆ మ్యాజిక్ ని మరలా రిపీట్ చేయలని భావించిన నంబర్ వన్ యారీ టీం మరలా సెకండ్ సీజన్ ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్ లో నిన్న రానా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సెలబ్రిటీలలో ఉన్న యారీలు(స్నేహితులు) బయట ప్రపంచంతో సంబందం లేకుండా ఎలా ఉంటారు, ఎలా మాట్లాడుకుంటారు లాంటి అంశాలను ఈ షో టచ్ చేయనుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా తన పెళ్లి ప్రస్తావన తెచ్చిన ఒక ఫిలిం రిపోర్టర్ కి పంచ్ లు కూడా వేసాడు రానా. అయితే ఈ షో సెకండ్ సేజన్ ఈ నెల 14 నుండి మొదలు కానుంది. దానికి సంబందించిన టీజర్ మీద మీరు కూడా ఒక లేక్కేసేయ్యండి.