క్రికెట్ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్..ఈ ఏడాది ఆ లీగ్ లేనట్టే !

no BPL this year

క్రికెట్ ఫ్యాన్స్ కి ఈ ఏడాది ఒక బ్యాడ్ న్యూస్ . అదేంటంటే బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌కు ఎన్నికల సెగ తాకింది. సార్వత్రిక ఎన్నికల ప్రభావంతో బీపీఎల్ లీగ్ వెనక్కి వెళ్లిందాని సమాచారం. తొలుత ఈ ఏడాది అక్టోబర్‌లో బీపీఎల్ నిర్వహించాలని నిర్వాహకులు భావించారు. కానీ అక్టోబర్ తర్వాత బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో.. భద్రత కల్పించలేమని పోలీసు యంత్రాంగం తేల్చిచెప్పింది. దీంతో ఈ టీ20 టోర్నీని వచ్చే ఏడాది జనవరి 5 నుంచి నిర్వహించనున్నట్టు నిర్వాహకులు ప్రకటించారు.

మిర్పూర్‌లో టోర్నమెంట్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్లు, ఫ్రాంచైజీల ప్రతినిధుల మధ్య జరిగిన భేటీ అనంతరం ఈ నిర్ణయాన్ని ప్రకటించారు. ‘బంగ్లాదేశ్ సార్వత్రిక ఎన్నికలు డిసెంబర్ చివరి వారంలో నిర్వహించే వీలుంది. దీంతో జనవరి 5, ఫిబ్రవరి 8 తేదీల మధ్య బీపీఎల్ నిర్వహించనున్నాం’ అని బీపీఎల్ టెక్నికల్ కమిటీ చైర్మన్ జలాల్ యూనస్ ప్రకటించారు. అయితేబీపీఎల్ వెనక్కి వెళ్లిపోవడంతో.. అక్టోబర్లో జింబాబ్వే బంగ్లా పర్యటనకు రానుంది. ఇరు జట్లు మూడు వన్డేలు, రెండు టెస్టుల్లో హోరాహోరీ తలపడనున్నాయి.