ఐఫోన్ ఎక్స్ ని తలదన్నే ఫోన్ విడుదల చేసిన ఎల్జీ !

lg-launched-new-mobile

ఇప్పటి వరకు ప్రపంచంలోనే ఖరీదైన ఫోన్ అంటే మనం టక్కున చెప్పే పేరు, ఐఫోన్ ఎక్స్ . అయితేఇక నుండి ఆ స్థానాన్ని మరో ఫోన్ కొట్టేసింది. గృహోపకరణాల రంగంలో దిగ్గజమైన ఎల్జీ ఒకనూతన మొబైల్ ని విడుదల చేసింది. తాజాగా ఎల్ జీ అత్యంత ఖరీదైన ఫోన్ ను లాంచ్ చేసింది. గతేడాది  లాంచ్ చేసిన సిగ్నేచర్ సిరీస్ కు కొనసాగింపుగా ప్రీమియం సిగ్నేచర్ ఎడిషన్(2018)ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 6జీబీ ర్యామ్, 256 జీబీ ఇంటర్నల్ మెమొరీతో వస్తున్న ఈ ప్రీమియం ఫోన్ రూ.1,22,820కు లభ్యం కానుంది.

ఆండ్రాయిడ్ 8.0 ఓరియో ఓఎస్, క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 845 ప్రాసెసర్ తో పనిచేసే ఈ ఫోన్ లో మెమొరీని 2 టీబీ వరకూ విస్తరించుకోవచ్చని ఎల్ జీ ప్రకటించింది. ఫోన్ వెనుకవైపు సెన్సార్లతో రెండు 16 మెగాపిక్సెల్ కెమెరాలు, ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను ఏర్పాటు చేసినట్లు ఎల్ జీ తెలిపింది. ఈ మొబైల్ లో 3300 ఎంఏహెచ్ బ్యాటరీతో పాటు క్యూహెచ్ డీ డిస్ ప్లే,  వైర్ లెస్ చార్జింగ్, క్వాల్ కామ్ క్విక్ చార్జ్ 3.0 వంటి ఆకర్షణీయమైన ఫీచర్లు ఉన్నట్లు ఎల్ జీ వెల్లడించింది. ఈ ఫోన్ ప్రీ-బుకింగ్స్ ను నేటి నుంచే ప్రారంభించామని పేర్కొంది. ఈ ఫోన్ వాటర్, డస్ట్ ప్రూఫ్ అట….ఫోన్ ప్రియులూ ఒక లుక్ వేసుకోండి మరి.