లో బీపీ వస్తోందా…ఇవి వాడేయండి !

tips preventing low bp

రక్తపోటుని బీపీ అని కూడా అంటారన్న విషయం తెలిసిందే. అయితే దానిని నార్మల్ గా 120/ 80 అని చెబుతారు. అంటే అలా కాకుండా ఇంకా takkuva రీడింగ్ లు వస్తే వారికి లో బీపీ అంటాము.
అందులో మరో మూడు రకాలు ఉన్నాయి.
90 – 60 – బార్డర్ లైన్ లో బ్లడ్ ప్రెజర్ .
60 – 40 – టూ లో బ్లడ్ ప్రెజర్ .
50 – 33 – డేంజర్ బ్లడ్ ప్రెజర్ .
అయితే బీపీ ఎక్కువ అయితే ఎంత డేంజరో…లో బీపీ అంతకన్నా డేంజర్. ఆ లోబీపీతగ్గించుకునేందుకు మీకోసం కొన్ని చిట్కలు

1.పచ్చి బీట్ రూట్ రసం లోబీపీకి మంచి ఔషదంగా చెప్పవచ్చు.

2.బలహీనంగా లేదా మైకంగా అనిపించినపుడు, పాలు కలపని కాఫీ(డికాషన్) తాగండి.

3.బీపీ నార్మల్ అయ్యే వరకు, ఉప్పు ఎక్కువగా ఉన్న ఆహారాలను
తినండి.

4.రోజు సైక్లింగ్, వాకింగ్ లేదా యోగ వంటి చిన్న చిన్న వ్యాయమలను చేయండి.

5. 30 ఎండుద్రాక్షలను తీసుకొని, గిన్నెలో వేసి, పూర్తి రాత్రి నానబెట్టండి. ఉదయాన, ఖాళీ కడుపుతో వీటిని తినండి. తరువాత ఒక గ్లాసు నీటిని తాగండి. ఇలా వారానికి 2 నుండి 3 సార్లు చేయటం వలన కూడా లోబీపీ నుండి తక్కువ సమయంలో ఉపశమనం పొందుతారు.

6.తులసీ ఆకులను తీసుకొని, సరిగా దంచండి. తరువాత పలుచని గుడ్డ సహాయంతో, ఈ మిశ్రమాన్ని వడపోయండి. ఇలా వడపోసిన మిశ్రమాన్ని, ఒక చెంచా తేనెతో కలిపి, రోజు ఉదయాన ఖాళీ కడుపుతో ఉన్నపుడు తీసుకోండి. తేనె కలపటం వలన దీని ప్రభావం రెట్టింపు అవుతుంది.