ఈసారి సంక్రాంతికి పండగ కల లేదు…!

No House Full Board In Theatres On Sankranthi Festival

సంక్రాంతి అంటే సినిమావాళ్ళకు ఆ టైం కు సినిమాలు విడుదల చేసి క్యాష్ ను సొమ్ము చేసుకుంటారు. ఇలా ప్రతి సంక్రాంతి జరుగుతూ వస్తుంది. కానీ ఈసారి పరిస్థితి మాత్రం వేరేలా ఉన్నది. ఈ సంక్రాంతి కు మూడు తెలుగు స్ట్రెయిట్ సినిమాలు ఒక్క తమిళ డబ్బింగ్ సినిమా పండగ భరిలో ఉన్నాయి. అందులో బాలకృష్ణ నటించిన ఎన్టీఆర్ బయోపిక్ చిత్రం. ఈ చిత్రంపై చిత్ర బృందం భారీ అంచనాలు పెట్టుకుంది. కానీ ఇప్పుడు పరిస్థితి చూస్తే మాత్రం వేరేలా ఉన్నది. ఈ సినిమాకు హౌస్ ఫుల్ బోర్డ్స్ ఎక్కడ కనిపించడంలేదు. ధియేటర్ దగ్గర మాములు పరిస్థితే ఉన్నది. రజినీకాంత్ పేటా సినిమా కూడా ఆ పరిస్థితి లేదు.

రిలీజ్ మొదటి రోజు ఆ సినిమాకు పెద్ద ఎతున్న థియేటర్స్ ఇచ్చారు కానీ ఎక్కడ సొల్ద్ ఔట్స్ బోర్డ్స్ లేవు. ఇకా రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ చిత్రం యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందింది. ఈ చిత్రం యొక్క బూకింగ్స్ మాత్రం మొదటిరోజు హౌస్ ఫుల్ బోర్డ్స్ మాత్రం లేదు. ఈ చిత్రం ఈ వీకెండ్ కు విడుదలవుతున్నా కానీ థియేటర్స్ నందు అడ్వాన్సు బూకింగ్స్ కనిపించడంలేదు. సినిమా బుకింగ్ సైట్స్ లోను ఇదే పరిస్థితి ఉన్నది.వెంకటేష్, వరుణ్ తేజ్ ల ఎఫ్2 సినిమా కూడా ఇదే పరిస్థితి. సంక్రాంతి సెలవలు కావడం అందులోను పంచాయతి ఎలక్షన్స్ కావడంతో అందరు ఉర్ల ప్రయనంలోను ఉన్నారు. ఇన్ని సినిమాలు కూడా ఒక్కేసారి వస్తుండటంతో ప్రేక్షకులో నెమ్మదిగా చూడవచ్చులె అనే అభిప్రాయం లేకపోలేదు. మొత్తానికి సక్రాంతికి సినిమా కల మాత్రం లేదు.